శీతాకాలంలో పెరిగే స్ట్రోక్ ప్రమాదం, కారణాలు.. ఎలా నివారించాలి..!?
చలి క్రమేణా పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింతగా చలి పెరుగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పెరుగుతున్న చలి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు బయట పడతాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పోలిస్తే ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, శీతాకాలం లో స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో దీని ప్రభావం ఐదు నుంచి పది శాతం పెరుగుతుందని చెబుతున్నారు. అయితే, చలికాలంలో స్ట్రోక్ ప్రమాదం ఎందుకు వస్తుంది? ఈ ప్రమాదాన్ని ఎలా నివారించాలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
వాతావరణ మార్పు బ్రెయిన్ స్ట్రోక్ పై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. చలి వాతావరణం గుండె, ప్రసరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. చలికి శరీరం ప్రతిస్పందించి రక్తనాళాలను సంకోచింపజేస్తుంది, దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. అంతేకాకుండా, కాలానుగు ణ మార్పులు మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో రక్తం కొద్దిగా మందంగా మారుతుంది, ఇది గడ్డకట్టడానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ విధంగా రక్తం గడ్డకట్టినప్పుడు, మెదడుకు రక్త ప్రవాహం తగ్గడమే కాకుండా, ఇస్కీమిక్ స్ట్రోక్‌కు కూడా దారితీసే అవకాశం ఉందని మెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడంతో పాటు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు కూడా పెరుగుతుంది. ఈ కారకాలన్నీ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

దీంతో ప్రతీ రోజూ 30 నిమిషాలు నడవడం లేదా ఇతర కార్యకలాపాలు చేయడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని 25% వరకు తగ్గించవచ్చు. శీతాకాలంలో సరిగ్గా నీరు తాగకపోతే డీహైట్రేషన్ సమస్య వస్తుంది. శీతాకాలంలో కఠినమైన పనులు చేయకూడదు. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు ను పెంచుతుంది. శీతాకాలంలో ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపు రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులను మరింత తీవ్రం చేస్తుంది, ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని విశ్లేషిస్తున్నారు. రక్తనాళాలు సంకోచించకుండా ఉండటానికి వీలైనంత వెచ్చగా ఉంటూ... మంద పాటి దుస్తులు ధరించాలి. ఇండోర్ వ్యాయామాలు చేయటం... అధిక ఒత్తిడిని నివారించటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాహం వేయకపోయినా, పుష్కలంగా నీరు తాగటం మర్చిపోవద్దు. రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. ఇక.. మద్యం సేవించడం, ధూమపానం చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications