డైలీ బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని మ్యూస్లీ తీసుకోండి చాలు..
చాలా పాపులర్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్.. మ్యూస్లీ. ఓట్స్, డ్రై ఫ్రూట్స్, కొన్ని రకాల సీడ్స్, ఇతర చిరు ధాన్యాలతో కూడిన అల్పాహారం. దీనిని పెరుగు, పాలు లేదా పండ్ల రసంతో తరచుగా తింటుంటారు. మ్యూస్లీ కాంప్లెక్స్.. కార్బోహైడ్రేట్లకు మంచి వనరు. ప్రతిరోజూ దీనిని తినడం జీర్ణవ్యవస్థ, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రోజూ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం లేదా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా దీన్ని పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి పప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఫైబర్ పుష్కలం..
బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం- ఆకలి నియంత్రణ, మెరుగైన జీర్ణక్రియ కోసం ఓ వ్యక్తి రోజుకు వివిధ రూపాల్లో కనీసం 30 గ్రాముల ఫైబర్ ను తీసుకోవాలి. మ్యూస్లీలోని పండ్లు, ఓట్స్ వల్ల ఇది తీరుతుంది. ఫైబర్‌కు మ్యూస్లీ అద్భుతమైన వనరు. జీర్ణవ్యవస్థకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఒక గిన్నె మ్యూస్లీని తీసుకోవడం ద్వారా ఫైబర్ ఇంటేక్ పెరుగుతుంది. ఇది ప్రిబయోటిక్స్లో సమృద్ధిగా ఉండి, పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.

2. బరువు తగ్గడం..
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. మ్యూస్లీ. శరీర బరువును తగ్గించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. మ్యూస్లీ ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఆకలిని నియంత్రించుకున్నట్టవుతుంది. అతిగా తినాలనే లేదా చిరుతిండ్లు మీద ధ్యాస మళ్లుతుంది. అకారణంగా తలెత్తే ఆకలిని అడ్డుకుంటుంది. దాని అధిక ఫైబర్ కారణంగా ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. సమగ్ర, సంతృప్తికర అల్పాహారాన్ని తీసుకున్నట్టవుతుంది. మ్యూస్లీలోని పోషకాల మిశ్రమం న్యూట్రీషన్ సమతుల్యతకు తోడ్పడుతుంది. దీనివల్ల తక్కువ సమయంలో అదనపు కేలరీలను బర్న్ చేయగలుగుతారు.
3. శక్తిని పెంచుతుంది..
మ్యూస్లీ ఎనర్జీని మాత్రమే ఇవ్వదు. దీనిలోని ఓట్స్, పండ్లు, ఇతర సూపర్ ఫుడ్లలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి ప్రాథమిక శక్తి వనరులు. మ్యూస్లీని తీసుకోవడం వల్ల మీ కండరాలకు, మెదడుకు పోషణ లభిస్తుంది. ప్రాసెస్ చేసిన పదార్థాలకు బదులుగా మ్యూస్లీ ప్రోటీన్లు, కొవ్వులలో సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా, ఎక్కువ కాలం నిలిచే శక్తిని అందిస్తుంది.
4. గుండె ఆరోగ్యానికి మంచిది..
గుండె సంబంధిత సమస్యలను నివారించాలనుకుంటే, మ్యూస్లీ అద్భుతాలు చేస్తుంది. ఇది ఓట్ బ్రాన్‌తో నిండి ఉంటుంది, ఇందులో బీటా-గ్లూకాన్ కలదు. బీటా-గ్లూకాన్ కొలెస్ట్రాల్ స్థాయిలను 10 శాతం వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. మ్యూస్లీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.
5. పోషకాలతో నిండి ఉంటుంది..
మ్యూస్లీలోని పదార్థాలు జీడిపప్పు, బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా గింజలు, జనపనార వంటి కొవ్వు ఆమ్లాలలో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు, క్రమం తప్పకుండా మ్యూస్లీని తీసుకోవడం వల్ల మోనోఅన్‌శ్యాచురేటెడ్, పాలీఅన్శ్యాచురేటెడ్, ఒమేగా-3 వంటి నిర్దిష్ట కొవ్వులు శరీరానికి లభిస్తాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన మెదడు, గుండెనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. సమగ్ర పోషకాలకు మ్యూస్లీ ఉత్తమ ఎంపిక.
-
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications