ఆంధ్రా స్టైల్ పాలకూర పప్పు.. నెయ్యితో వేడి అన్నంలో తింటే అదుర్స్,హెల్త్ బెనిఫిట్స్!
భారతీయ వంటకాలలో పప్పుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. భారతీయులందరూ తమ ఆహారంలో పప్పు ఉండేలా చూసుకుంటారు. పప్పు ప్రోటీన్ కావడంతో పప్పు తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ పాలకూర పప్పు ఏ విధంగా తయారు చేయాలి? దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం.
పాలకూర పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
పాలకూర- రెండు కట్టలు
కందిపప్పు - 200 గ్రాములు
పచ్చిమిరపకాయలు- ఆరు
చింతపండు- కొద్దిగా
ఉప్పు- రెండు స్పూన్లు
కారం- రెండు స్పూన్లు
పసుపు- హాఫ్ స్పూను
నూనె- రెండు స్పూన్లు
ఎండు మిరపకాయలు- రెండు
వెల్లుల్లి రెబ్బలు- నాలుగు
కరివేపాకు- రెండు రెమ్మలు
పోపు గింజలు- ఒక స్పూను

తయారీ విధానం
కుక్కర్ లో 200 గ్రాముల కందిపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అందులో పాలకూరను కట్ చేసి వేయాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఆడ్ చేయాలి.ఇందులో చింతపండు కూడా యాడ్ చేయాలి. ప్రెజర్ కుక్కర్లో వీటన్నింటిని ఉడికించాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ను ఆఫ్ చేయాలి. కుక్కర్ ప్రెషర్ వదిలిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మెదపాలి.
ఇలా చేస్తేనే పప్పు రుచిగా
పప్పు మరీ చిక్కగాను, లేదా మరీ పల్చగా లేకుండా కన్సిస్టెన్సీ మనమే చూసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన చిన్న పాన్ పెట్టి నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు వేయాలి. అందులోని అందులోని ఎండు మిరపకాయలు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేయాలి. ఆపై అందులో కరేపాకు వేసి చిటపటలాడే వరకు ఉంచి తర్వాత దీనిని పప్పులో కలపాలి.
పాలకూర పప్పులో ఆరోగ్య ప్రయోజనాలు ఇలా
స్టవ్ మీద సిమ్‌లో పెట్టి పప్పుని కాసేపు ఉడికించాలి. అంతే రుచికరమైన ఆంధ్ర స్టైల్ పాలకూర పప్పు రెడీ. ఈ పప్పును వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే అదిరిపోతుంది. పాలకూర పప్పులో ఉండే పోషకాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ఇమ్యూనిటీని పెంచటానికి, రక్త హీనతను తగ్గించటానికి, ఎముకల పుష్టికి, కంటి చూపుకు బాగా పని చేస్తుంది.
-
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications