వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Astrology: పీడకలలతో నిద్రపట్టటం లేదా? అయితే ఈ నివారణోపాయాలు ట్రై చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

ఒక వ్యక్తికి ఆనందం కలిగించేది ఏమిటి? సాధారణంగా, సుదీర్ఘ సమయం పని చేసిన తర్వాత హాయిగా నిద్ర పోతే అదే ఆనందం కైగిస్తుంది. మంచి విశ్రాంతి మనుషుల శారీకర, మానసిక ఆరోగ్యానికి కారణం. అయితే చాలామంది ప్రశాంతమైన నిద్రకు బదులుగా ఎప్పుడూ ఏదో ఒక కలలు కంటూ ఉంటారు. నిద్రపోతున్న సమయంలో కలలో కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయని చెప్పడం చూస్తుంటాం.

మన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అనేక కారణాలు కలలకు కారణమవుతాయని చెబుతున్నా చాలా కలల వల్ల మనకు లబ్ధి చేకూరుతుందని, మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని కలలు మనకు తీవ్రమైన నష్టం చేస్తాయని కూడా చెప్తారు. అయితే ఎలాంటి కలలు మంచివి, ఏవి చాలా డేంజర్ అన్న విషయాలను పక్కన పెడితే కలలు చాలా మందిని ఆందోళనకు గురి చేస్తాయి.

కలలతో నిద్రలేమి, అలసిపోయిన ఫీలింగ్ .. నివారణోపాయాలు సూచించిన జ్యోతిష్య శాస్త్రం

కలలతో నిద్రలేమి, అలసిపోయిన ఫీలింగ్ .. నివారణోపాయాలు సూచించిన జ్యోతిష్య శాస్త్రం

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అసలు కలలు ఎందుకు వస్తాయి అంటే .. రాహువు కలలకు అధిపతి. రాహువు చంద్రునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు కలలు కంటాడు. అయితే, నిద్రిస్తున్నప్పుడు మాత్రమే కలలు కనడం తప్పనిసరి కాదు, కొంతమంది వ్యక్తులు పగటి కలలు కూడా కంటూ ఉంటారు.

కలలు ప్రాథమికంగా మన మనస్సు యొక్క ఆలోచనలు కాబట్టి అవి ఎప్పుడైనా రావచ్చు. కలలన్నీ రాహువుచే నియంత్రించబడతాయి. ఇక కలల వల్ల నిద్రలేమి కలుగుతుంటే, తీవ్రంగా అలసిపోయిన భావన ఏర్పడితే, వస్తున్న కలలన్నీ పీడకలలుగా పరిగణిస్తే అందుకు నివారణోపాయాలను కూడా జ్యోతిష్య శాస్త్రం సూచించింది.

పీడకలలు రాకుండా ఇంటిని ఉప్పునీటితో శుభ్రం చేసుకోవాలి

పీడకలలు రాకుండా ఇంటిని ఉప్పునీటితో శుభ్రం చేసుకోవాలి

పీడ కలలను వదిలించుకోవడానికి చాలా ముఖ్యమైన నివారణలలో ఒకటి మీ ఇంటిని ప్రతిరోజూ ఉప్పు నీటితో శుభ్రం చేయడం. పడుకునే ముందు ఉప్పునీటితో ఇల్లు తుడుచుకోవడం వల్ల మీరు మంచి నిద్రను పొందగలరని చెప్పబడింది. పీడకలలు రాకుండా ఉండడానికి మీ పాదాలను గోరువెచ్చని నీటితో కడుక్కోవడం మంచిదని సూచించబడింది. పడుకునేటప్పుడు మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలను ఉత్తరం వైపు ఉంచి పడుకుంటే పీడ కలలు రాకుండా ఉంటాయని సూచించబడింది.

 చెప్పులు మంచానికి దగ్గరగా లేకుండా చూసుకోవాలి

చెప్పులు మంచానికి దగ్గరగా లేకుండా చూసుకోవాలి

పడుకునే ముందు భయంకరమైన దృశ్యాలను చూడటం, అవి మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపటం కూడా కలలకు కారణం అవుతుందని చెప్పబడింది. మీ పాదరక్షలను మీరు పడుకునే ప్రాంతానికి సమీపంలో ఉండకుండా చూసుకోవాలని, మంచం క్రింద కానీ, సమీపంలో కానీ చెప్పులు ఉంటే పీడ కలలకు అవకాశం ఉందని చెప్పబడింది. ఇక పీడ కలలకు ప్రతికూల ఆలోచనలు కారణం కాబట్టి ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం మొక్కలకు కొద్దిగా నీరు పోయాలని సూచించబడింది.

స్త్రీలు జుట్టు విరబోసుకుని పడుకోకూడదు

స్త్రీలు జుట్టు విరబోసుకుని పడుకోకూడదు

స్త్రీలు నిద్రపోయే ముందు జుట్టును విరబోసుకోకుండా సరిగ్గా కట్టుకోవడం మంచిది. రాత్రి సమయంలో పొడవాటి జుట్టును అల్లుకోకుండా వదిలేయడం ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. తద్వారా కూడా పీడకలలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మహిళలు పీడ కలలకు ఆస్కారం ఇవ్వకుండా జడ వేసుకోవాలని సూచించారు. ఇక పడుకునే ప్రదేశం దగ్గర గుడ్డతో కప్పబడిన రాగి పాత్రలో కొంత శుభ్రమైన నీటిని ఉంచడం కూడా పీడ కలల నివారణకు ఉపయోగపడుతుందని సూచించబడింది.

English summary
Can't sleep with nightmares? Feeling very tired with bad dreams? But try these remedies to avoid bad dreams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X