Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

horoscope today: నేడు వీరికి అదృష్టయోగం పడుతుంది.. పండుగ చేస్కోండి!

డిసెంబర్ 17 బుధవారం రోజు గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏ రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు? అనే వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
నేడు మేష రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం నేడు లభిస్తుంది.

Horoscope today These people will have good fortune today Celebrate

వృషభ రాశి
వృషభ రాశి వారికి నేడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కీలక నిర్ణయాలలో ఈరోజు విజయం సాధిస్తారు.

మిధున రాశి
మిధున రాశి వారికి నేడు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ప్రశంసలను కూడా అందుకుంటారు. స్నేహితులతో విభేదాలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారిలో కుటుంబ ఆనందం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

సింహరాశి
సింహ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది. ఆర్థికంగా సింహ రాశి వారికి లాభదాయకమైన రోజు. సింహరాశి వారి నాయకత్వ లక్షణాలు నేడు వెలుగులోకి వస్తాయి.

కన్యారాశి
కన్యా రాశి వారికి నేడు పనులలో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

తులారాశి
తులా రాశి వారికి భాగస్వామ్య వ్యవహారాలు లాభాలను ఇస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. నేడు శుభవార్తలు అందుతాయి.

వృశ్చిక రాశి
నేడు వృశ్చిక రాశి వారికి అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. మాటల విషయంలో సంయమనం పాటించాలి. వృత్తి, వ్యాపారాలు చేసే వారిలో సానుకూల మార్పులు వస్తాయి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నేడు శుభ యోగాల కాలం. నేడు ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు, ప్రణాళికలు ప్రారంభించే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి
మకర రాశి వారికి నేడు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. పెద్దలు సలహా తీసుకుంటే మంచి జరుగుతుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి నేడు సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. నేడు వీరికి ప్రయాణ సూచన కనిపిస్తుంది.

మీన రాశి
నేడు మనసుకు నచ్చిన పనులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+