మార్చి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులవారు వీరే!
మార్చి నెలలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి శుభ ప్రయోజనాలను తెస్తుంది. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిలో సంచారం చేస్తాడు. మార్చి 14న రవి కూడా మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మార్చి 3న ఏర్పడనున్న చంద్రగ్రహణం కొన్ని రాశుల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి కొత్త జీవితానికి నాంది కానుంది. మరి ఆయా రాశులవారికి మార్చి నెలలో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
మార్చి 2న వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయటం వలన వృషభరాశి జాతకులు అదృష్టాన్ని చూస్తారు. ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కలలు నెరవేరుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.

మిథునం
మిధునరాశి జాతకులకు మార్చి మాసం కలిసి వస్తుంది. ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర, సూర్యుల సంచారం, మార్చి 3న సంభవించే చంద్ర గ్రహణ ప్రభావంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది, ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు కోరుకున్న సంస్థలో ఉద్యోగం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు వస్తాయి.
కన్య
సప్తమ స్థానం శుక్ర, రవులతో పటిష్ఠం అవుతున్నందువల్ల ఈ నెలంతా కన్యా రాశి వారికి సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో కన్యా రాశి వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి.
తుల
మార్చి నెలలో తులారాశి వారికి షష్ఠ స్థానం బలంగా మారడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఈ సమయంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తులా రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రయత్నపూర్వక లాభాలతో పాటు అప్రయత్న ధనలాభం లభిస్తుంది. పిత్రార్జితం కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.
మకరం
మకరరాశిలో అత్యంత శుభ గ్రహాలైన శుక్ర, శనులు తృతీయ స్థానంలో కలుస్తున్నందువల్ల ఈ రాశివారు తలపెట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాలలో తీరిక లేకుండా శ్రమిస్తారు. లాభాలు భారీగా పెరుగుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
కుంభం
ఈ నెలంతా ధనస్థానం పటిష్టం కావడంతో ఈ రాశిపై గ్రహణ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఆదాయానికి లోటులేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలున్నాయి. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications