వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sankranti 2023: మకర సంక్రాంతి చాలా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్; ఈ పనులు చేస్తే గొప్ప ఫలితం!!

|
Google Oneindia TeluguNews

తెలుగు వాళ్ళందరూ ఇష్టంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి పండుగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పట్టం కడుతూ, కొత్త ధాన్యం రాశులు ఇంటికి చేరిన వేళ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అటువంటి సంక్రాంతి పండుగ విషయంలో ఈ సంవత్సరం అనేక ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు ఎవరైతే అత్యంత నిష్టతో సూర్యుని పూజిస్తారో, దానధర్మాలు చేస్తారో వారికి విశేషమైన ఫలితాలు ఈ సంవత్సరమంతా ఉంటాయని చెబుతున్నారు.

సంక్రాంతి పండుగ విషయంలో సందిగ్ధం .. పండితులు చెప్పిందిదే

సంక్రాంతి పండుగ విషయంలో సందిగ్ధం .. పండితులు చెప్పిందిదే

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అన్న దానిపై కొంత సందిగ్ధత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొంతమంది జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ అంటే, మరి కొంతమంది జనవరి 15వ తేదీన పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. అయితే పండితులు ఈ సందిగ్ధానికి చెక్ పెడుతూ సంక్రాంతి పండుగను జనవరి 15వ తేదీన జరుపుకోవాలని సూచిస్తున్నారు. జనవరి 14 వ తేదీన రాత్రి 8 గంటల 45 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే రాత్రి వేళల్లో సూర్యుని పూజించటం, స్నానాలు దానాలు చేయడం సాధ్యం కాదు కాబట్టి మరుసటి రోజు తెల్లవారుజామున ఉదయం 7 గంటల నుండి తొమ్మిది గంటల ప్రాంతంలో స్నానాలు, దానాలు చేయాలని అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుని పూజించాలని పండితులు చెబుతున్నారు.

ఈసారి సంక్రాంతి చాలా స్పెషల్

ఈసారి సంక్రాంతి చాలా స్పెషల్

ఇక 15వ తేదీన మకర సంక్రాంతిని ఉదయం 7 గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 46 నిమిషాల వరకు పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు.చాలా మంది ఉదయం వచ్చిన తిథిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి రాత్రివేళ వచ్చిన తిధిని పరిగణనలోకి తీసుకోకూడదని, 15వ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈసారి వచ్చే సంక్రాంతి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది.

ఆదివారం.. సూర్యుడిని పూజించే సంక్రాంతి

ఆదివారం.. సూర్యుడిని పూజించే సంక్రాంతి


ముఖ్యంగా సంక్రాంతి పండగ నాడు అందరూ సూర్యభగవానుని పూజిస్తారు. సూర్యుడు అన్ని గ్రహాలలోనూ తొలుత పూజింపబడే భగవంతుడు . ఆయన ఆరోగ్యాన్ని, ఆయుష్షును, సుఖసంతోషాలను ఇచ్చే భగవంతుడు. ఆదివారం సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయబడింది. అటువంటి ఆదివారం నాడు ఈ సంవత్సరం సూర్యభగవానుని ప్రత్యేకంగా పూజించే సంక్రాంతి పండుగ రావడం చాలా విశేషంగా చెబుతున్నారు. సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటంలో దానాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజు దానం చేస్తే దాని ఫలితం మామూలుగా ఉండదని అంటున్నారు.

 మన జీవితంపై సూర్యుడి ప్రభావం.. సంక్రాంతి నాడు పూజిస్తే సత్ఫలితం

మన జీవితంపై సూర్యుడి ప్రభావం.. సంక్రాంతి నాడు పూజిస్తే సత్ఫలితం

మన జీవితంపై సూర్యుడి ప్రభావం ఎంతగానో ఉంటుందని, ఆదిత్యాయ చ సోమాయమంగళాయ బుధాయచగురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమఃఈ శ్లోకంలోనూనవ గ్రహాలలో మొదట సూర్యుణ్ణే స్మరిస్తాము కాబట్టి సూర్యుడి ఆరాధనకు కేటాయించబడిన ఆదివారం నాడే, మకర సంక్రాంతి రావడం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం శుభపరిణామమని అంటున్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్... అని కూడా చెబుతుంటారు. తన ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగ రోజు సూర్యభగవానుడిని పూజిస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Makar Sankranti is said to be very powerful when it falls on Sunday, the week of sun worship. It is said that worshiping the sun on Sankranti is really powerful,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X