మీన రాశిలో శని సంచారం: మూడు రాశులకు వరదలా అదృష్టం!
వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నవగ్రహాలలో శక్తివంతమైన గ్రహంగా శని దేవుడిని పరిగణిస్తారు. శని దేవుడు దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం ఒకే రాశిలో సంచారం చేస్తూ వివిధ రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తాడు. శని దేవుడు బృహస్పతి రాశి అయిన మీన రాశిలో ఉన్నాడు. నవంబర్ మాసంలో మీనరాశిలో తిరోగమనం నుంచి ప్రత్యక్షంగా మారాడు.
మీనరాశిలో శని సంచారం
ప్రస్తుతం మీన రాశి లోనే సంచారం చేస్తున్న శని దేవుడు బాల్య స్థితిలో ఉన్నాడు. ఈ కారణం వల్ల ఆయన అన్ని రాశుల వారి పైన గణనీయమైన ప్రభావాలను చూపించలేకపోతున్నాడు. కానీ మూడు రాశుల్లో జన్మించిన వారికి శని శుభాలను చేకూరుస్తున్నాడు. చంద్ర రాశి ఆధారంగా రూపొందించిన ఈ విశ్లేషణను బట్టి అదృష్టవంతులు అయిన ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి రాబోయే 69 రోజులు చాలా బాగుంటుంది. శని వృషభ రాశి వారి కోరికలను నెరవేరుస్తాడు. లాభ మరియు సంపద గృహంలో శని సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. జీవితంలో సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది.
కన్యారాశి
కన్యా రాశి వారికి శని జాతకంలో ఐదు మరియు 6వ ఇళ్లను పాలిస్తూ ఏడవ ఇంటి గుండా సంచారం చేయడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఇది కన్యా రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కన్యారాశిలో ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి శని ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఇది ఆరవ మరియు ఏడు ఇళ్లకు అధిపతిగా ఉండటం వల్ల సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు విజయాలను సాధిస్తారు. కార్యాలయంలో పురోగతి కనిపిస్తుంది . ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. లాటరీలు మరియు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శని కారణంగా ఆదాయం వేగంగా పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications