వాస్తు ప్రకారం ఇంటి సింహద్వారం ఇలా ఉంటే లక్ష్మి దేవి సంతోషంగా వస్తుంది
వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించినా, వాస్తు ప్రకారమే అందులోకి వస్తువులు తెచ్చినా ఎక్కడో ఒకచోట లోపం కనపడుతుంటుంది. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే కొన్ని నియమాలున్నాయి. ఇంటి ప్రధాన ద్వారం ఆ ఇంటి స్థితిగతులను తెలియజేస్తుంది. వాకిలిని చూడగానే ఆ ఇల్లు ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుంటుంది. అందుకే తులపును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం ఇంకా ఏమేం అనుసరించాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవిని సంతోషంగా మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం.
హిందూ సాంప్రదాయంలో ప్రధాన ద్వారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఇంటి ముఖద్వారం లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేలా ఉండాలి.
ప్రధాన తలుపు గడపను ఆ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు.

మనం ఎక్కడ, ఏ పని కోసం వెళ్లినా తిరిగి ఇంటికి వస్తాం.
మన చివరి మజిలీ ఇల్లు.
ఇంటికి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి.
చిరునవ్వును, నిశ్చింతను కలిగించాలి.
లక్ష్మీదేవి నివాసం ఉండటంతోపాటు మనకు ఆహ్వానం పలికేచోటు ప్రధాన ద్వారం.
ఇంటి ముఖ ద్వారం పక్కన ఒక చిన్న అద్దం అమర్చాలి.
అద్దాలు దేవతలకు స్వాగతం పలుకుతాయి.
అంతే కాదు దుష్టశక్తులను దరిచేరనివ్వకుండా చేస్తాయి.
ఒక చిన్న పాత్రలో నీళ్లు నింపి దానిలో కొద్దిగా గులాబి రేకులు వేసి ముఖద్వారం పక్కన ఉంచాలి.
దీనివల్ల అందంతోపాటు సానుకూల శక్తి వస్తుంది.
ఒక చిన్న పన్నీరు బుడ్డిలో రోజ్ వాటర్ నింపాలి.
ఇంట్లోకి అతిథులు వచ్చిన వెంటనే వారి మీద కాస్త చిలకరిస్తే వారికి మర్యాదగా ఆహ్వానం పలికినట్టు ఉంటుంది.
పసుపు లేదా కుంకుమతో ఇంటి ముఖద్వారాన్ని చక్కగా అలంకరించుకోవాలి.
దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచివస్తుంది.
ఇంట్లోకి సానుకూల శక్తి కూడా సింహద్వారం నుంచే వస్తుంది.
మనకు సంపదనిస్తుంది.
వృద్ధిలోకి తెస్తుంది.
అందుకే ముఖద్వారం ఎంత శుభ్రంగా, అందంగా ఉంటే అంతగా కలిసివస్తుంది.
స్వస్తిక్, ఓమ్ వంటి పవిత్ర చిహ్నాలను ఇంటి ముఖద్వారానికి అలంకరించాలి.
ఈ చిహ్నాలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా అడ్డుకుంటాయి.
ప్రశాంతంగా ఉండే వాతావరణం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది.
ఇంటి గడప దగ్గర దీపం ఉంచాలి.
లేదంటే లైటు అయినా ఉండాలి.
ఇలా వెలుతురు ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే.
చీకటిని పారద్రోలి, అజ్ఞానాన్ని అంతం చేస్తుంది.
ఇంటి ముఖద్వారానికి గంట లేదా శంఖాన్ని అలంకరించాలి.
గంట శబ్దం, శంఖం శబ్దం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి.
-
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications