• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆరు గ్రహాల పరివర్తనం వలన ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలుంటాయి

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గ్రహాలు, నక్షత్ర రాశులకు ఫిబ్రవరి నెలలో ప్రత్యేకత సంతరించుకొనున్నది. నెలలో ఒకే రాశిలో ఆరు గ్రహాల కలయిక కారణంగా అనేక మార్పులు జరగనున్నాయి. ఫిబ్రవరి 4న గ్రహాల యువరాజైన బుధుడు తిరోగమనం చెందనున్నాడు. తర్వాత శని మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడు కుంభరాశిలోకి, గురువు మకరరాశిలోకి సంచారం చేయనున్నాడు. గ్రహాల మార్పు ఈ నెలంతా కొనసాగుతుంది. గ్రహాల మార్పు, కలయిక వలన కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావం పడనుండగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ విషయమై ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఏయే రాశులకు అనుకూలంగా ఉంటుందో చూద్దాం.

What are the consequences for any constellation due to the transition of the six planets

​మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఆరు గ్రహాల మార్పు వలన మీకు సానుకూల ఫలితాలుంటాయి. మీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. విద్యారంగంలో విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీకు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అసంపూర్ణమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ సూచనలు చర్చించుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉత్తమ ఫలితాలను సాధించుకుంటారు. స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో నూతన వెలుగు వస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఆరు గ్రహాల కలయిక వలన మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు మీ కార్యచరణను ప్రభావితం చేస్తుంది. ఎవరితో వాదనకు దిగకండి. సంబంధంలేని విషయాలలో తల దూర్చకండి. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. కుటుంబ విధులు మీరొక్కరే చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా విభేదాలు రావచ్చు. చేసే వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మధ్యవర్తిత్వాలు చేయకండి. ఈ సమయంలో ఎవ్వరికైనా రుణాలు ఇవ్వడం మానుకోండి. లేకుంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. సృజనాత్మక పనిని కోల్పోతారు.​ అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- గ్రహాల మార్పు మీకు అనేక శుభ ఫలితాలను, నూతన అవకాశాలను తీసుకొస్తుంది. నిర్ణయాలు తీసుకునే మీ మేధా సామర్థ్యం పెరుగుతుంది. మీరు నూతన ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మీ సంబంధం బలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతల కోసం ముందుకు వస్తారు. శత్రువులను వదిలించుకుంటారు. పోటీ, స్ఫూర్తి మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ సమయంలో మీకు అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. మీ పెట్టుబడులతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు పని ప్రదేశంలో ఉన్నత స్థానాలను పొందుతారు. ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశాలను కూడా పొందుతారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- గ్రహాల మార్పు వలన ఫలితాలు మధ్యస్తంగా ఉంటాయి. నూతన పెట్టుబడులకు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయడానికి ఇది శుభ సమయం కాదు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో ఆరోగ్య జీవితం గురించి మీరు మీ పనిశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహార నియమాలను పాటించాలి. మీకు పడని ఆహార, పానీయాలకు దూరంగా ఉండాలి. మీరు ప్రేమ జీవితంలో నూతన ప్రారంభాన్ని పొందుతారు. కటినమైన మాటలు, ప్రవర్తనను నియంత్రించండి. విద్యార్థులు మంచి మార్కులు పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. వృత్తిపరమైన రంగంలో అనవసరమైన చర్చ, వివాదాలకు దూరంగా ఉండండి.​ అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- గ్రహాల మార్పు వలన సౌకర్యాన్ని పెంచుతుంది. కార్యాలయంలో మీ లక్ష్యాలను సాధించడానికి మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ మార్పు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో మంచి ఫలితాలకు దారితీస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేస్తుంది. అన్ని అడ్డంకులు తొలగించబడతాయి. ఆకస్మిక లాభం వచ్చే అవకాశముంది. తండ్రి మద్దతు మీకు ఓ వరమని రుజువు చేస్తుంది. జీవిత భాగస్వామి ఆదాయం పెరగడంతో మనస్సు సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు అంతమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఆరు గ్రహాల మార్పు అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు జీవితంలో ప్రేమ, ఆనందం, శుభఫలితాలను పొందుతారు. నిజాయితీతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. తండ్రి నుంచి వారసత్వ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శుభ అవకాశం లభిస్తుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. రోగ నిరోధక శక్తి విస్తరిస్తుంది. మీకిష్టమైనవారితో మంచి సమయం గడుపుతారు. ఈ సమయంలో మీరు శక్తితో నిండి ఉంటారు. ఆశాజనకంగా కనిపిస్తారు. ప్రతిరంగంలోనూ ప్రయోజనాన్ని పొందుతారు. అది వృత్తిపరమైన లేదా సామాజికమైంది కావచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- గ్రహాల మార్పు వలన సమాజ, కుటుంబ వ్యవహారంలో గట్టి పోటీని ఎదుర్కోవాలి. ఇతరులతో మాట్లాడే సమయంలో ప్రియంగా , శాంతంగా ఆలోచనాత్మకంగా మాటలను, పదాలను ఉపయోగించాలి. ఆవేశం, అనాలోచిత చర్యలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పని పూర్తి చేయడంలో విఫలమైతే కోపం పెరుగుతుంది, జాగ్రత్త వహించాలి. మసాలా ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశముంది. పనిప్రదేశంలో పోటీ పడి పనిచేయాలి. శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. గ్రహాల మార్పులు మీ పనిలో తీవ్రమైన మార్పును తీసుకొస్తాయి. కాబట్టి పెట్టుబడికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశమున్నందున అనవసరమైన ఖర్చులు మానుకోండి.​ అర్దాష్టమ శని దోష నివారణకు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- గ్రహాల మార్పు వలన ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి. ప్రేమ విషయంలో ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి భంగం కలిగించే అవకాశముంది. కాబట్టి మీ కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల ప్రవర్తన మీకు ఒత్తిడిని తీసుకొస్తుంది. ఇది మీ ఇద్దరి మధ్య తేడాలను కలిగిస్తుంది. అనవసరమైన చర్చ గొడవలకు కారణమవుతుందని గుర్తుంచుకోండి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలసిపోయే కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రశాంత ఆరోగ్య జీవితాని కొరకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.​ గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- గ్రహాల మార్పు వలన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో ఏ విషయంలో నైనా సన్నిహితులతో, బంధువులతో వివాదం జరగవచ్చును, అది మీ మనస్సును కొంత కలవరపెడుతుంది. పెట్టుబడులకు ఈ సమయం సరైనది కాదు. ఆదాయం, ఖర్చులు వేగవంతం చేయండి. మీ పనిపై దృష్టి పెట్టండి. పనిని నిజాయితీగా పూర్తి చేయండి. అధికారుల సరైన ప్రశంసలు లేకపోవడం నిరాశకు దారితీస్తుంది.​ ఏలినాటి మూడవ భాగం దోష నివారణకు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- గ్రహాల రాశి చలనం వల్ల మీకు పురోగతి ఉంటుంది. మీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొదుతారు. వృత్తిపరమైన లాభాలు పొందుతారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో మీ అనుభవాల జ్ఞానం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధించడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ సోదరుల, సోదరీమణులతో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. మీ స్వభావం, ప్రవర్తన మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీ మనస్సు మతపరమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఏలినాటి శని రెండవ భాగం దోష నివారణకు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- గ్రహాల మార్పు మీపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఉద్యోగం కోసం నిరుద్యోగుల అన్వేషణ పూర్తవుతుంది. ఆకస్మిక లాభాలు పొందుతారు. భవిష్యత్తును బలోపేతం చేయడానికి మీ వ్యూహం ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తారు. ఈ సమయంలో పనిప్రదేశంలో ప్రమోషన్ ఉంటుంది. ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశముంది. మీరు జీవితంలో చేసిన వాటిని మీరు అభినందిస్తారు. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అవరోధాలు అంతమవుతాయి. వివాహితులకు కొన్ని అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు చాలా అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రధమ భాగ దోషనివారణకు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

​మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- గ్రహాల మార్పు వలన మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో మీ ప్రవర్తన, మాటలపై శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంచడానికి ఖర్చులను అదుపు చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే రుణాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కుట్రలకు దూరంగా ఉండండి. అనవసరమైన ప్రమాదాలకు దూరంగా ఉండండి. వాహనాల వినియోగంలో జాగ్రత్త వహించండి. కుటుంబంతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఫేక్ సంస్థలకు దూరంగా ఉండండి. అనైతిక కార్యకలాపాలకు పాల్పడకండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
The month of February is special for planets and constellations. Many changes will take place during the month due to the combination of six planets in a single constellation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X