వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరకచతుర్దశి: ఏమిటి, ఏం చేయాలి?

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏ చతుర్ధశినాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.నరకచతుర్దశికి ప్రేత చతుర్దశి' అనే పర్యాయనామం కూడా వాడబడి ఉంది.

ఈనాడు నరకముక్తికోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని వ్రతచూడామణి చెబుతున్నది. గుజరాతీలు నరకచతుర్ధశిని కాలచౌదశ్ అంటారు.

సంస్కృతములో కాళచతుర్ధశి, కాళచతుర్ధశి అనగా అంధకారపు చతుర్ధశి అని. ఇలస్టేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ఒకరు ఈ చతర్దశి కాగితో సంబంధపడినదిగా చెబుతున్నారు. నరకలోక వాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించడానికి చేసే ఉత్సవమనీ, తమకు నరకలోకప్రాప్తి లేకుండా చేసుకునే కార్యకలాపదినమనీ, నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశి అని నమ్మకం.

What is Naraka chaturdashi and what should we do?

*చతర్దశ్యాంతుయేబీపాన్నరకాయ దదంతిచ తేషాం పితృగణాళి, సర్కే నరకాత్ స్వర్గ వూఫరయజో అనిశాస్త్ర వచనం.

"చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతులు అందరూ నరకలోకము నుండి స్వర్గలోకానికి పోవుదురు, అని దాని తాత్పర్యము.

ఈ పర్వ సంబంధమైన కార్యకలాపంలో ముఖ్యమైనది ఏమిటంటే తెల్లవారకుండా అభ్యంగన స్నానం చేయడం, చీకటి వుండగా స్నానం చేయనివారు నరక కూపంలో పడిపోతారట.ప్రతీమాసంలోనూ బహుళచతుర్దశి మాస శివరాత్రి. ఆనాడు కాని, మరునాడు బహుళ అమావాస్యనాడుకాని అభ్యంగస్నానం చేయకూడదనే నిషేధం ఒకటి హిందూ సంఘంలో ఉంది. ఈ నిషేధం ఆశ్వయుజ బహుళచతుర్దశికి అమావాస్యకు లేదు. పైగా ఆనాడు అభ్యంజన స్నానం విధిగా చేయాలని వ్రతచూడామణి మున్నగు గ్రంథాలు చెబుతున్నాయి.

యమతర్పణం

చంద్రోదయ కాలాన శాస్తోక్తంగా స్నానం చేయడం వల్ల నరక బాధ లేకుండా కాపుదల అవుతుంది. నరకము తప్పించినందుకు నరకస్వామి అయిన యముడికి ఆ మిూద తర్పణం చేయాలి. తర్పణంచేసేటప్పడు ఉత్తరేణి ఆకుల్ని తలమిూద ఉంచుకోవాలి. నాడు పదునాలుగవ (చతుర్దశి) తిథి, నాటి తర్పణంలో యముణ్ణి పదునాలుగు నామాలతో అర్చించాలి.

యమాయనమః ధర్మరాజాయనమః మృత్యతేనమః అంతణాయనమ వైవస్వతాయనమ కాలాయనమః సర్వభూతక్షయాచనమః ఔదుంబరాయనమః ధధ్నాయనమఃలీలాయనమః పరమేష్టినేనమః వృకోదరాయనమః చిత్రాయనమః చిత్రగుస్తాయనే నమః దక్షిణాభిముఖంగా కూర్చోవాలి. ఒక్కొక్కనామాన్నే ఉచ్చరిస్తూ తిలలతోడి జలాంజలులు మూడేసి మూడేసి విడవాలి.

దీపదానం

నరకచతుర్ధశినాడు సాయంకాలం ప్రదోషకాలమందు దీపదానం చేయాలి. దేవాలయాల్లో మఠాల్లో దీపపంక్తులు ఉంచాలి. లక్ష్మీకాములైన మానవులు ఈనాడును, దీపావళినాడును, కార్తికశుద్ధ పాడ్యమినాడును దీపప్రదానము విధిగా చేయాలి.

శాస్రాల్లో ప్రదోషకాలాన చేసే ఈ దీపదానాల వల్ల రెండు విధాలైన ఉపయోగాలు ఉన్నట్లు చెప్పబడింది. ఈ దీపాలు నరకలోకవాసులకు వలసిన వెలుతురును ఇస్తాయి.

ఈ దీపదానాలవల్ల ఇక్కడి వారికి యమమార్గాధికారుల బాధ లేకుండా పోతుంది, నరక బాధ తప్పిపోతుంది.

English summary
Astrologer describes Naraka Chathurdashi and its importance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X