వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార దేవతా పూజలు

|
Google Oneindia TeluguNews

మనకున్న వారాం రోజులలో ఒక్కో రోజుకు ఓక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. వాటికి సంబంధించిన జపం,హోమం, దానం, తపస్సు మొదలైనవి చేయాల్సి ఉంటుంది.పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనే సామెత అందరం వింటూనే ఉంటాం.పెద్దలు చెప్పే,చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం,ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, వ్రతాలు,నోములు చేయరు.

ఆదివారం : ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. ఆరోగ్యం భాస్కరాద్ధిచ్ఛేత్‌ అన్నారు. అనగా సూర్యుడు ఆరోగ్య కారకుడు. ఈ రోజున అమ్మ నాన్నలను ,గురువులను ఇతర దేవతలను పూజించాలి. రవిని పూజించడం వల్ల నేత్రరోగాలు, శిరోబాధలు, కుష్టు బాధలు తగ్గుతాయి.అభాగ్యులకు భోజనం పెట్టాలి.ఇలా ఒక రోజు నుంచి ఒక నెల లేదా సంవత్సరం లేదా మూడు సంవత్సరాలు అనారోగ్య తీవ్రతను బట్టి పూజ చేసుకోవడం వల్ల సూర్యానుగ్రహం లభిస్తుంది.

what is vaara devatha puja?

సోమవారం : సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని సామెత ఉంటుంది. అనగా ఏది కావాలన్నా ముందు శివుని ఆజ్ఞ తప్పనిసరి కావున ఈ రోజున శివుని అభిషేకించడం మంచిది. శివునితోపాటు సంపద కావాలనుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధించి పెదవారికి భోజనం,పెద దంపతులకు భోజనం పెట్టాలి.సకల సంపదలు కలుగుతాయి.

మంగళవారం : ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామి ప్రీతికరమైన రోజు.ఈ రోజున కొంచెం కోపం శాతం ఎక్కువగానే ఉంటుంది.ఆ రోజున శాంతిని పొందాలి.ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను అనుసరించి ఆరోజు ఉగ్రం తగ్గించుకోవడానికి కాళీదేవతను ఆరాధించాలి.మినపప్పు,కందిపప్పు,పెసరపప్పుతో అన్ని రకాల పప్పులతో చేసిన రుచికరమైన వికలాంగులకు భోజనానికి పెట్టాలి.అనారోగ్య నివృత్తి తగ్గుతుంది.

బుధవారం : బుధవారం గణపతికి ప్రీతికరమైన రోజు గణపతికి అధిదైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. విష్ణు మూర్తికి పెరుగు అన్నం అంటే ప్రీతి ఎక్కువ. కాబట్టి పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి.దీనివలన వీరికి సంతానం అనుకూలంగా ఉంటుంది. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చక్కి ఆరోగ్యం చేకూరుతుంది.

గురువారం : గురువారం గురువులకు ప్రీతికరమైన రోజు.ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరుకునేవారు దక్షిణామూర్తికి కాని సాయిబాబాకు గాని పాలతో అభిషేకం చేయాలి.పాల పదార్థాలు నివేదించాలి. అందరికీ పంచిపెట్టాలి. పసుపు రంగు పెద పిల్లలకు,వృద్దులకు దానంగా ఇవ్వాలి.

శుక్రవారం : శుక్రవారం లక్ష్మీప్రదం. ఈ రోజున స్త్రీలందరూ అందరగా అలంకరించుకుని శ్రద్ధతో పూజ చేయాలి. లలితాదేవిని ఆరాధించాలి. దీనివలన సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.అనాధలకు,వికలాంగులకు భోజనం పెట్టాలి. అలంకరణ వస్తువులు దానంగా ఇవ్వాలి. అందమైన వస్త్రాలను బహూకరించాలి.

శనివారం : ఇది వెంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన రోజు.ఈ రోజున రావిచెట్టుకు ప్రదక్షిణలు,హనుమాన్,వైష్ణవ ఆలయాలను దర్షణం చేసుకోవాలి.సూర్యోదయాని కంటే ముందే నిద్ర నుండి లేవాలి.వాస్తవానికి ప్రతీ రోజు తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి అన్ని పనులు ముగించుకోవడం మంచిది.శనివారం రోజు గోవులకు,పశు పక్ష్యాదులకు వాటి ఆహార గ్రాసం,త్రాగడానికి నీళ్ళను అందించాలి .

అందరికీ అన్నీ కావాలి ఏ ఒక్కటి లేకపోయినా వెలితిగానే కనిపిస్తుంది.కావున ప్రతీరోజు ఆ వారానికి సంబంధించిన అధిదైవాన్ని కాని తమ ఇష్టదేవతను కాని పూజించుకొని,శక్తి కొలది దానం చేయడం తప్పనిసరి.వారాధిపతి పూజా ,దానాల వాలన గ్రహ శాంతులు కలుగుతాయి.
--- డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

English summary
what is vaara devatha puja?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X