Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వార్‌,ఎంసిసిల విలీనం: నేత గణపతి

హైదరాబాద్‌:సిపి ఐ (యంయల్‌) పీపుల్స్‌వార్‌,మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఐ)విలీనమమై కొత్త పార్టీగా అవతరించింది. ఈరెండు పార్టీలను విలీనం చేసి భారతకమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ను ఏర్పాటుచేశారు. ఈ విషయాన్ని పీపుల్స్‌వార్‌నాయకుడు సుధాకర్‌ గురువారంవిలేకరుల సమావేశంలోవెల్లడించారు. అంతకు ముందేతెలుగు ఛానళ్లలో ఈ వార్తప్రసారమైంది. సెప్టెంబర్‌ ఇరవై ఒకటవతేదీన విలీనమైనట్లు సుధాకర్‌చెప్పారు. ఈ విలీనం వివరాలనుపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శిరామకృష్ణ విలేకరుల సమావేశంలోవివరించారు. కొత్త విప్లవ పార్టీకి ఇప్పటివరకు పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీకార్యదర్శిగా వ్యవహరిస్తున్నగణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారనిఆయన చెప్పారు.

భద్రతాకారణాల రీత్యా ఈ విలీనం విషయాన్నిదేశవ్యాప్తంగా తాము ఒకేసారివెల్లడించినట్లు రామకృష్ణ చెప్పారు. ఈరెండు విప్లవ పార్టీల మధ్యపాతికేళ్లుగా ప్రయత్నాలుజరుగుతున్నాయి. పందొమ్మిది వందలడెబ్బై ఎనిమిదిలో విలీనానికి ప్రతిపాదనవచ్చింది. పందొమ్మిది వందల ఎనబై ఒకటవపీపుల్స్‌వార్‌ నేత కొండపల్లిసీతారామయ్య, ఎంసిసి కనోయ్‌ ఛటర్జీపన్నెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. ఒకతరహా విప్లవ పంథానుఅనుసరిస్తుండడం వల్ల విలీనానికిప్రతిపాదన, చర్చలు జరిగాయి.పందొమ్మిదివందల ఎనబై రెండులో కనోయ్‌ ఛటర్జీమరణించారు. కొండపల్లిసీతారామయ్య అరెస్టయ్యారు. దీంతోచర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.పీపుల్స్‌వార్‌లోని అంతర్గత విభేదాలవల్ల కొంత ఆలస్యం జరిగింది. పందొమ్మిదివందల తొంబై రెండులో మళ్లీ చర్చలుప్రారంభమయ్యాయి. మూడేళ్ల పాటుపెద్ద యెత్తున చర్చలు జరిగాయి.ఎట్టకేలకు చర్చలు ఫలించి రెండు పార్టీలవిలీనం జరిగింది. ఈరెండు పార్టీలకు గెరిల్లా ఆర్మీలున్నాయనిరామకృష్ణ చెప్పారు. ఈ రెండు పార్టీలగెరిల్లా ఆర్మీలను కలిపి పీపుల్స్‌ గెరిల్లాలిబరేషన్‌ ఆర్మీగా పిలువనున్నట్లు ఆయనతెలిపారు. ఇతర విప్లవ పార్టీలతోఐక్యతకు కూడా చర్చలుజరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సిపిఐ (యంయల్‌) జనశక్తితో ఇప్పటికేకలిసి నడుస్తున్నామని ఆయనచెప్పారు. ఈ విలేకరుల సమావేశంలోజనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శిఅమర్‌ రామకృష్ణ పక్కనేకూర్చున్నారు. ఈ రెండు పార్టీల విలీనంభారత ప్రజల ముందు ఆశావహ స్థితినితెచ్చిందని అమర్‌ అన్నారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+