రిపబ్లిక్ డే విధ్వంస కుట్ర భగ్నం
నోయిడా: రిపబ్లిక్ డే రోజున విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. దీంతో ఢిల్లీకి పెద్ద ముప్పు తప్పిందని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదమూకలు పథకం రచించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు అంటున్నాయి.
ఈ తెల్లవారుఝామున నోయిడాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నొయిడాలోని మహా మాయ ఇంటర్ కాలేజీ దగ్గర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మృతి చెందిన తీవ్రవాది పాకిస్థానీయుడుగా గుర్తించారు. వీరి దగ్గర నుంచి పాక్ పాస్‌పోర్ట్, రెండు ఏకే 47 రైఫిల్స్, నాలుగు గ్రెనేడ్లు, పెద్దయెత్తున నగదు, మారుతీ కారును స్వాధీనం చేసుకున్నారు.
ఆయుధాలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు మారుతి కారును వెంబడించి అడ్డుకున్నారు. దీంతో తీవ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. చనిపోయినవారు పాక్ దేశస్తులుగా గుర్తించారు. రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా భారీ విధ్వాంసానికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. కారునుంచి పాస్‌పోర్టు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications