చెప్పాల్సిన అవసరం లేదు: స్పీకర్

స్పీకర్ తమ స్వేచ్ఛను కాపాడాలని, స్పీకర్ కాపాడకపోతే ఎవరు కాపాడుతారని, మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని రాజేందర్ అన్నారు. ఈ సమయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి మీడియాపై విధించిన ఆంక్షలపై తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాలను బయటకు పంపి సభను నడిపించుకుంటామంటే హుందాగా ఉండదని, ఫ్లోర్ లీడర్లను పిలిసి మాట్లాడుతానని స్పీకర్ అంటే సరిపోయేదని రాజేందర్ అన్నారు. తాను బిఎసిలోనే చెప్పానని స్పీకర్ చెప్పారు. తాను రోజూ మీడియాను కలుస్తూనే ఉన్నానని, తన బాధ్త ఏమిటో తనకు తెలుసునని, ఏం చేయాలనే విషయంపై తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications