ఖమ్మం: తనను ఇక్కడి నుంచి తరలించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి కె. రోశయ్యను హెచ్చరించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ఉన్న కెసిఆర్ తో రోశయ్య, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ మంగళవారం ఫోనులో మాట్లాడారు. రోశయ్య డిజిపి, ఇంటలిజెన్స్ ఐజి మహేంద్ర రెడ్డిలతో సమావేశమైన తర్వాత కెసిఆర్ కు ఫోను చేశారు. తనను ఇక్కడి నుంచి తరలించకపోతే ఆస్పత్రిని తగులబెట్టిస్తానని కెసిఆర్ రోశయ్యతో అన్నట్లు సమాచారం.
తనను ఖమ్మం ఆస్పత్రి నుంచి తరలించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన అన్నారు. తనను తరలించడానికి హెలికాప్టర్ తెప్పించాలని, అందుకు అవసరమైన ఖర్చులను తామే భరిస్తామని ఆయన చెప్పారు. ఖమ్మం ఎస్పీపై కెసిఆర్ డిజిపి గిరీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.