వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'అనంత'లో టిడిపి నేత నన్నపనేని అరెస్టు

సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం శాసనసభ్యులు చేస్తున్న నిరాహార దీక్షా శిబిరాన్ని నన్నపనేని సందర్శించారు. దీక్షలో కూర్చున్న శాసనసభ్యులు పరిటాల సునీత తదితరులను ఆమె పరామర్శించారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. ఎస్కే విశ్వవిద్యాలయం విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.