జైపూర్: రాజస్థాన్ లోని కోటాలో వంతెన కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు చేరుకుంది. రాజస్థాన్ లోని కోటలో వంతెన గురువారం రాత్రి కూలిన విషయం తెలిసిందే. మృతదేహాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు శనివారం అధికారులు చెప్పారు. కూలిన వంతెన శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు శుక్రవారంనాడే అనుమానించారు. చంబల్ నదిపై నిర్మిస్తున్న వంతెన అది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది.
గాయపడిన పలువురిని ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. వారిని వెలికి తీసేందుకు సైన్యం ముందుకు వచ్చింది. రాష్ట్ర రాజధానికి ఇది 150 కిలో మీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం నాడు 17 మంది మరణించినట్లు గుర్తించారు
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి