జగన్ పేరుతో మోసం, లేడీ కిలాడీ అరెస్టు

కృత్తివెన్ను ఎస్సై ఎల్ రమేష్ కథనం ప్రకారం విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన శాలి శారమ్మ (చిన్ని) ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇంతేరుకు చేరుకుంది. ఇదే మహిళ 20 రోజుల క్రితం ఇంతేరుకు వచ్చి వైయస్ పేరున ఆయన తనయుడు జగన్ ట్రస్టు ఏర్పాటు చేశారని నమ్మబలికి డ్వాక్రా మహిళల నుంచి రూ.11,500 వరకు వసూలు చేసింది. విషయాన్ని గమనించిన స్థానిక యువకులు ఆమెను అడ్డుకు డబ్బులు స్వాధీనం చేసుకుని హెచ్చరించి వదిలేశారు.
అదే మహిళ మళ్లీ గ్రామానికొచ్చి జిరాక్స్ కాపీలను గ్రామస్తులకు పంచిపెడుతూ ఒక్కొక్కరు రూ. 50 చెల్లిస్తే పది కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, మంచినూనె ప్యాకెట్ ఇస్తామని నమ్మబలికింది. సర్పంచ్ వెంటనే ఎస్సైకు సమాచారం ఇవ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసిన ఎస్సై మోసగత్తె అని తేలడంతో కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications