వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసస్ ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్ టాబ్లెట్ పిసి ప్రత్యేకతలు

|
Google Oneindia TeluguNews

Asus Eee Pad Transformer
కాలిఫోర్నియా: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఏసస్.. ఆండ్రాయిడ్ ఆధారిత "ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్" టాబ్లెట్‌ పిసిను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అవసరమైనప్పుడు ప్లగ్ చేసుకునేలా.. అవసరం లేదనుకున్నప్పుడు తొలగించుకునే వీలుండేలా ఓ కీప్యాడ్‌ను ఈ టాబ్లెట్‌కు అనుసంధానించుకోవచ్చు. పూర్తిగా ల్యాప్‌టాప్ వాడుతున్న అనుభవాన్ని కలిగించేలా ఈ టాబ్లెట్ పిసి ఉంటుందని కంపెనీ తెలిపింది. జనవరి 2011లో జరిగిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఏసస్ తమ ఇతర టాబ్లెట్ పిసిలతో పాటు ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రదర్శించింది.

ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌, ఎన్‌విఐడిఐఏ టెగ్రా 2 డ్యూయెల్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 1280x1280 రెజల్యూషన్ కలిగిన 10.1 ఇంచ్‌ల పూర్తి టచ్‌స్క్రీన్‌తో లభిస్తుంది. దీని తయారీకి ఉపయోగించిన ఎల్ఈడి బ్యాక్‌లైట్‌తో కూడిన ఐపిఎస్ ప్యానెల్ ధృఢమైన స్క్రాచ్-రెసిస్టెంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రూపొందింనట్లు కంపెనీ పేర్కొంది. ఫలితంగా దీనిని 178 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూడవచ్చు. ఇంకా దీనిలో ఎస్ఆర్ఎస్ సౌండ్ టెక్నాలజీ వాడటం వల్ల డైనమిక్ 3డి స్టీరియో ఆడియో అనుభూతినిస్తుంది.

ఇందులో రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. నాణ్యమైన ఫోటోలను, వీడియోలను రికార్డ్ చేసుకునేందుకు టాబ్లెట్ పిసి వెనుకవైపున 5 మెగాపిక్సెల్ కెమెరాను, వీడియో కాలింగ్ సదుపాయం కోసం ముందు వైపున 1.2 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో ఏర్పాటు చేశారు. ఫుల్ క్వెర్టీ కీ బోర్డ్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రో ఎస్‌డి కార్డ్ రీడర్ పోర్ట్ తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇది 9.5 గంటల బ్యాటరీ బ్యాక్‌అప్‌ను డాక్ ద్వారా దీనిని 16 గంటలకు పెంచుకోవచ్చునని కంపెనీ పేర్కొంది. దీని ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు.

'ఏససే ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్' టాబ్లెట్ పిసి సాంకేతిక వివరాలు & ఫీచర్లు:

* 10.1-inch LED touchscreen 1280x800 pixels
* Gorilla Glass Technology
* Android 3.0 Honeycomb OS
* NVIDIA Tegra 2 processor
* Optional mobile dock
* 5 MP rear-facing camera with HD video support
* 1.2 MP front-facing camera
* Wi-Fi 802.11 b/g/n
* Bluetooth 2.1 with EDR
* 2-in-1 Audio Jack
* Mini HDMI 1.3 port
* Micro SD Card Reader
* Adobe Flash 10.23 support
* Asus Waveshare UI
* 24.4Wh Li-polymer Battery

English summary
Consumer electronics manufacturer, Asus announced the launch of Android based Eee Pad Transformer tablet. This brand new tablet has an optional expandable keyboard docking station, which makes it to a full-fledged laptop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X