ప్రముఖ దర్శకుడు బాలచందర్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

బాలచందర్ 1930 జులైలో తమిళనాడులోని తంజపూరు జిల్లాలో జన్మించారు. నాటక రచయిత అయిన బాలచందర్ 1965లో సినీరంగంలోకి ప్రవేశించారు. ఆయన పలు ప్రభుత్వ, ప్రైవేట్ అవార్డులు పొందారు. ఆయన సినిమాలు అపూర్వ రాగగళ్, అవర్గల్, 47 నాట్కల్ (47 రోజులు), సింధు భైరవి, ఏక్ ధూజే కే లియే, మరో చరిత్ర, రుద్రవీణ వంటి చిత్రాలను తీశారు. ఆయనకు తమిళంలో ఎంత ఆదరణ ఉందో తెలుగులో కూడా అంతే ఆదరణ ఉంది. ఆయన తమిళంలో తీసిన పలు సినిమాలు తెలుగులో వచ్చాయి.
ఆయనకు 1987లో పద్మశ్రీ అవార్డు లభించింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనను 1973లో కలైమమణి బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వర్ణ నంది, రజత నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయనకు పలు మార్లు ఉత్తమ దర్సకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. మరో చరిత్ర, ఇది కథ కాదు, అంతులేని కథ, రుద్రవీణ, తొలి కోడి కూసింది వంటి ఆయన తెలుగు చిత్రాలు ఎంతో ఆదరణ పొందాయి. అక్కినేని జాతీయ అవార్డు కూడా ఆయనకు లభించింది. రజనీకాంత్, కమల హాసన్‌లను నటులుగా తీర్చిదిద్దింది బాలచందరే. వారిద్దరు ఆయనను తమ గురువుగా గౌరవిస్తారు.












Click it and Unblock the Notifications