హైదరాబాద్: ఓల్డ్ సిటీలో కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని పలువురు నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి శంకర్రావు, భాజపా నేత విద్యాసాగరరావు, కడప మాజీ ఎంపీ జగన్మోహన్‌రెడ్డి తదితరులు ఆయన్ను వేరువేరుగా పరామర్శించారు. అత్యవసర చికిత్సా విభాగంలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్‌ను చూసేందుకు వైద్యులు లోపలికి అనుమతించడం లేదు.
కాగా ఆయన త్వరగా కోలుకోవాలని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కోరుకున్నారు. పాతబస్తీలో మైనార్టీలకు ఎంతో సేవలు అందించారని అన్నారు. ప్రభుత్వం అక్బరుద్దీన్ వైద్యం కోసం ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం అని హోంమంత్రి సబితారెడ్డి ప్రకటించారు. కేసును సిసిఎస్ పోలీసులకు అప్పగిస్తున్నట్టు చెప్పారు. జగన్ తన ప్రచారాన్ని వాయిదా వేసుకొని హైదరాబాద్ వచ్చారు.