సత్యసాయి స్థితికి నేను కారణం కాదు: వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్
State
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: భగవాన్ సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ తనపై వస్తున్న ఆరోపణలకు ఎట్టకేలకు శుక్రవారం నోరు విప్పాడు. సత్యసాయి ట్రస్ట్‌పై వస్తున్న ఆరోపణలతో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను కేవలం బాబా భక్తుడిని మాత్రమేనని, ఆయనకు సేవ చేసుకునేందుకు మాత్రమే వచ్చానన్నారు. బాబా అనారోగ్యానికి తాను కారణం కాదని చెప్పుకొచ్చారు. ట్రస్ట్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సత్యజిత్ అన్నారు. సాయిబాబా అనారోగ్యం పాలవడానికి, ఆఖరు దశలో తీవ్ర ఇబ్బందుల పాలవడానికి తాను కారణమనే వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.
సత్యసాయి ట్రస్టు సభ్యులపై వస్తున్న ఆరోపణల గురించి స్పందించేంత పెద్దవాడిని తాను కానన్నారు. బాబా తనకు అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించడమే తన బాధ్యత అన్నారు. ప్రశాంతి నిలయంలో తనకు ఎలాంటి ఇబ్బుందులు లేవని బాబా సేవలోనే తరిస్తున్నానని అన్నారు.