డిఎంకెపై రంజిత, నిత్యానంద జాయింట్ అటాక్

వీడియోలను నక్కీరన్ మార్ఫింగ్ చేసి తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందని ఆరోపించారు. అరవై కోట్ల రూపాయలు తమను డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. మార్పింగ్ వెనుక సన్ నెట్ వర్క్ హస్తం సైతం ఉందని వారు అభిప్రాయపడ్డారు. వీడియో ఓ బూటకం అని అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని నటి రంజిత చెప్పారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో తప్పుడు కథనాలు రాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వీడియోలను మార్ఫింగ్ చేసి తన జీవితాన్ని నాశనం చేశారని విమర్శించారు. తాను నిత్యానందతో రాసలీలలు చేశాననడంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. కాగా రంజిత చెన్నైలో సన్ నెట్ వర్క్ పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రంజిత ఫిర్యాదు వెనుక జయలలిత ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications