వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంద్రాగస్టు బహిష్కరణకు తెలంగాణ మంత్రుల నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్‌: ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాలను బహిష్కరించాలని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. జిల్లాల్లో స్వాతంత్ర్య దినోత్సవాలను బహిషక్రించడంతో పాటు ఉత్సవ పెరేడ్‌ను కూడా బహిష్కరించాలని వారు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసిన తెలంగాణ మంత్రులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ మంత్రుల నిర్ణయం నేపథ్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణలోని పది జిల్లాలో కలెక్టర్లను ఆదేశించాలని సాధారణ పరిపాలనా విభాగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణవాదులు అడ్డుపడే అవకాశం ఉండడంతో వాటికి దూరంగా ఉండాలని తెలంగాణలోని శాసనసభ్యులు కూడా భావిస్తున్నారు. ఇద్దరేసి మంత్రులున్న పలు జిల్లాల్లో కూడా తగాదాలు చోటు చేసుకున్నాయి.

English summary
For the first time in the history of Andhra Pradesh, district collectors are set to take the salute in the Telangana districts on the Independence Day in view of the ministers from the region deciding to stay away from all the official events on August 15 including the ceremonial parade, in protest against the delay in the creation of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X