వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ దర్యాప్తు: ప్రజల్లోకి చంద్రబాబు, టిడిపి నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజల ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. బుధవారం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు వారికి సూచించినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తున్నారు. అయితే, కాంగ్రెసు నాయకత్వంపై దాడికి పూనుకోవాలనే ఎత్తుగడలో చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా వైయస్ జగన్‌తో ఓ రహస్య అవగాహనకు వచ్చి తనపై వైయస్ విజయమ్మతో పిటిషన్ వేయించారని గట్టిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మొత్తం పది అంశాలపై కరపత్రం వేసే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. దాదాపు 60 పేజీల కరపత్రం వేసి ప్రజలకు పంచి పెట్టాలని నిర్ణయించుకున్నారు. వైయస్ జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయి తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి విజయమ్మ చేత పిటిషన్ వేయించారని మాత్రమే చంద్రబాబు గానీ ఆయన పార్టీ నాయకులు గానీ చెప్పే స్థితిలో ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, గతంలో వైయస్సార్ ప్రభుత్వం హయాంలో విచారణలు వేయించారని, ఏదీ నిరూపితం కాలేదని మాత్రమే చెప్పగలరు. అంతే తప్ప హైకోర్టు ఆదేశాలను తప్పు పట్టే అవకాశం ఉండదు.

అయితే, మొత్తంగా వైయస్ జగన్, గాలి జనార్దన్ రెడ్డిలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న తరుణంలో తనపై హైకోర్టు ఆదేశాలు జారీ కావడం పిడుగుపాటు వంటిదే. వారిద్దరిని చంద్రబాబు ఎడాపెడా వాయిస్తూ వచ్చారు. దానికి బ్రేకులు వేయాల్సిన స్థితిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును వసూల్ రాజాగా అభివర్ణిస్తూ తెరాస పార్టీయే కాదంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎదురుదాడికి స్వస్తి చెప్పి తనను తాను సమర్థించుకోవాల్సిన స్థితిలో పడ్డారు. ఈ విషయంపైనే ఆయన ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

English summary
It is said that N Chandrababu Naidu has decided to go into public on corrupt allegations against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X