హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ ఆమోస్ అసంతృప్తి: పదవులకు రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

KR Amos
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ మండలి కమిటీల నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎథిక్స్ కమిటీకి, అంచనాల కమిటీకి రాజీనామా చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీల పట్ల, సీనియర్ల పట్ల శాసనమండలి చైర్మన్ చక్రపాణి అవమానకరమైన పద్ధతిలో వ్యవహరించారని ఆయన విమర్శించారు. సీనియర్లకు కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తాము తెలంగాణకు చెందినవాళ్లం కాబట్టే చైర్మన్ పదవుల్లో వేయడం లేదని ఆయన తప్పు పట్టారు. సీనియర్లను విస్మరిస్తున్నారని ఆయన అన్నారు. కమిటీ చైర్మన్‌గా తనను నియమించకుండా సభ్యుడిగా వేయడంపై ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తెలంగాణ సీనియర్లలో ఒక్కరిని కూడా చైర్మన్‌గా నియమించలేదని ఆయన విమర్శించారు. ఇందుకు మండలి చైర్మన్ చక్రపాణి బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

శాసన మండలిలో సీనియర్లు ఆమోస్‌తో పాటు డి. శ్రీనివాస్, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఉన్నారు. వీరందరినీ కాదని, తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నాయకుడిని కమిటీ చైర్మన్‌గా నియమించారు. పదవుల విషయంలో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, అలా కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందినవారిని ఇరకాటంలో పెడుతూ అవమానకరమైన పద్ధతిలో చూశారని ఆమోస్ మండిపడుతున్నారు.

English summary
Congress senior MLC KR expressed unhappy with Legislative Council chairman Chakrapani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X