హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు రాజీనామాపై వట్టి, మంత్రులపై మండిపడ్డ గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vatti Vasanth Kumar - Gali Muddu Krishnama Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు తనకు నోటీసులు ఇచ్చినప్పుడు రాజీనామా చేశారా అని మంత్రి వట్టి వసంత్ కుమార్ మంగళవారం ప్రశ్నించారు. అసెంబ్లీలో కళంకిత మంత్రులు రాజీనామా చేయాలని టిడిపి సభ్యులు పట్టుబట్టడంపై వట్టి సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సాధారణే అయినప్పటికీ, ప్రజల్లో దురభిప్రాయం కలిగేలా టిడిపి సభ్యులు మంత్రులపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టిడిపి నేతలు మంత్రులను, కాంగ్రెసు నేతలను పట్టుకొని దొంగ, దోషి అంటున్నారని విమర్శించారు. లేనిపోని ఆరోపణల కారణంగా సీనియర్ ఐఏఎస్‌లు మనస్థాపం చెందుతున్నారని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు అడ్డు పెట్టుకొని టిడిపి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటుందన్నారు. లేనిపోని ఆరోపణల వల్ల శాసనసభ, శాసనసభ్యులు ప్రజల్లో చులకన అయ్యే అవకాశముందన్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు నోటీసులతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వణుకు పుట్టిందని గాలి విమర్శించారు. తప్పు చేసిన మంత్రులు, అధికారులు భయపడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని వివాదాస్పద 26 జివోలను సభలో స్పీకర్ ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Minister Vatti Vasanth Kumar questioned TDP chief Nara Chandrababu Naidu about resignation. TDP leader Gali Muddukrishnama Naidu demanded ministers resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X