హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగుదేశంలోకి ఆదికేశవులు నాయుడు తనయుడు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP Logo
చిత్తూరు/హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, చిత్తూరు జిల్లా నేత జంగాలపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో కొంతకాలం వరకు క్రియాశీల పాత్ర పోషించిన ఆదికేశవులు నాయుడు ఇటీవల మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు టిడిపిలోకి రానున్నారని అంటున్నారు. తండ్రి ఆశీర్వాదంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. జంగాలపల్లి శ్రీనివాస్ గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో సమావేశమైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వీరి చేరికపై చర్చించారని సమాచారం. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఒక సామాజికవర్గం ఓటర్లు కొందరు మన నుంచి దూరమయ్యాయని, వారిని మళ్లీ మనం దరిచేర్చుకోవాల్సిన అవసరం ఉందని బాబు నేతలకు సూచించారని తెలుస్తోంది.

ఆ వర్గానికి చెందిన నాయకులు మన వైపు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని, మీరందరూ ఆమోదిస్తే తీసుకుంటానని బాబు వారితో అన్నారట. ఆదికేశవులు కుమారుడిని తీసుకోవడం మంచిదేనని, అయితే జంగాలపల్లి శ్రీనివాస్‌ను తీసుకొనే ముందు చిత్తూరు నాయకులతో చర్చిస్తే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకోవడం మంచి నిర్ణయమని, దీనివల్ల వచ్చే ఉప ఎన్నికల్లో అక్కడ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారట. ఆదికేశవులు కుమారుడిని వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ఎంపి అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
TTD former chairman Adikeshavulu Naidu's son Srinivas may join in Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X