వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజితతో రాసలీలలు: నిత్యానంద స్వామికి కోర్టు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nithyananda Swamy-Ranjitha
బెంగళూరు: రాసలీలల నిత్యానంద స్వామికి స్థానిక రామనగర కోర్టు షాక్ ఇచ్చింది. ప్రముఖ నటి రంజితతో రాసలీలల కేసులో బెంగళూరులోని రామనగర జెఎంఎఫ్‌సి కోర్టు నిత్యానందకు రక్త, స్వర పరీక్షలు నిర్వహించాలని బుధవారం అధికారులను ఆదేశించింది. రెండేళ్ల క్రితం నిత్యానంద, రంజిత రాసలీలల సిడిలు పలు టీవి చానళ్లలో ప్రసారమైన విషయం తెలిసింది. ఇవి సంచలనం సృష్టించాయి.

దీనికి సంబంధించి అప్పట్లో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. వీడియో సిడిలలో ఉన్నది తాము కాదని నిత్యానంద, రంజిత చెబుతున్నారు. దీంతో వీడియోలో ఉన్నది వారా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించేందుకు పరీక్షలు చేయాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. దీనిపై తమకు సహకరించాలని నిత్యానందకు అప్పట్లో పలుమార్లు నోటీసులు అందజేశారు. అయితే నిత్యానంద మాత్రం స్పందించలేదు.

దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. నిత్యానందకు రక్త, స్వర పరీక్షలు జరపుతామని వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం నిత్యానందకు పరీక్షలు జరపాలని ఆదేశించింది. కాగా ఇటీవల బిడదిలోని ధ్యానపీఠానికి తాళం వేసిన కర్నాటక ప్రభుత్వం ఈ మంగళవారం పీఠాన్ని తిరిగి భక్తులకు అప్పగించింది.

మరోవైపు నిత్యానంద స్పెయిన్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు ఆయన ముంబయిలోని స్పెయిన్ రాయబార కార్యాలయానికి రెండు రోజుల క్రితం దరఖాస్తు ఇచ్చారని తెలుస్తోంది. రంజిత అనంతరం ఇటీవల మరో నటిపై నిత్యానంద పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
A Ramanagaram court on Wednesday allowed the CID to conduct medical and physical tests on self-styled godman Swami Paramahamsa Nithyananda in connection with a rape and sexual abuse case lodged against him in 2010.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X