హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమలక్కకు టిఆర్ఎస్ కౌంటర్, లగడపాటికి ఆవేశమే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupalli Krishna Rao
హైదరాబాద్: ఢిల్లీలో ఎవరి కాళ్లో పట్టుకుంటే తెలంగాణ రాదన్న తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు సోమవారం తెరాస భవనంలో మీడియాతో మాట్లాడారు. తమకు ఎవరి కాళ్లు పట్టుకునే ఖర్మ పట్టలేదని, ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యమం ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే అన్నారు.

తమకు బతిమాలే పరిస్థితే ఉంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌లు కెసిఆర్ చుట్టూ ఎందుకు తిరుగుతారన్నారు. ఢిల్లీ పెద్దలే తమ అధినేత చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఒక రాష్ట్రం సాధించాలంటే ఉద్యమంతో పాటు రాజకీయ చర్యలు అవసరమే అన్నారు. ఇది వరకు రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో విమర్సించిన వారు తెలుసుకుంటే మంచిదన్నారు. తాము మంత్రి పదవులను వదులుకున్నామని గుర్తు చేశారు.

లగడపాటిని బహిష్కరించాలి

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు దేశ బహిష్కరణ విధించాలని జూపల్లి మండిపడ్డారు. తెలంగాణవాదులను క్రూరమృగాలతో పోల్చడం సరికాదన్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న లగడపాటి పైన పిడియాక్ట్ కింద కేసు పెట్టాలన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లగడపాటికి ఏమాత్రం లేదన్నారు. లగడపాటికి ఆవేశం తప్ప ఆలోచన లేదని ధ్వజమెత్తారు.

తెలంగాణ కవాతు పైన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదన్నారు. రాజీనామా చేయాలని గుర్తు చేసే స్థాయికి మంత్రులు దిగజారారని మండిపడ్డారు. తాము రాష్ట్ర సాధన కోసం గల్లీలో ఉద్యమాలు చేస్తూనే ఢిల్లీలో చర్చలు జరుపుతామని టిఆర్ఎస్వీ నేత సుమన్ అన్నారు. కెసిఆర్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు.

English summary

 Telangana Rastra Samithi MLA Jupalli Krishna Rao lashed out at Telangana United Front president Vimalakka on Monday for her comments against TRS chief K Chandrasekhar Rao in Telaangana March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X