హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పు చేయమని వైఎస్ చెప్పలేదు, నేనూ అంతే: భాను

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu
హైదరాబాద్: తప్పు చేయాలని తాను ఏ అధికారి పైనా ఒత్తిడి తీసుకు రాలేదని ఐఏఎస్ అధికారి ఎంజివికె భాను చెప్పారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్‌‍కు భూముల కేటాయింపు కోసం తమపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అప్పుడు ఒత్తిడి వచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై భాను స్పందించారు. తప్పు చేయమని తాను ఎవరికీ చెప్పలేదని, అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తప్పు పని చేయమని ఎప్పుడూ చెప్పలేదని భాను చెప్పారు.

తప్పు చేయాలని తాను ఒత్తిడి తీసుకు వచ్చింది నిజమే అయితే దేవానంద్ అప్పుడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దేవానంద్ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి భయపడి ఉంటే ఆయన మరణం తర్వాత గానీ, తాను ఆంధ్రప్రదేశ్‌ను వదిలి వెళ్లాక గానీ ఫిర్యాదు చేయవచ్చు కదా అని అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారం అన్నారు. దేనికైనా సాక్ష్యాలు ఉండాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ఎవరో చేసిన తప్పులు తనపై రుద్దితే వారిపై న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయన్నారు. కొన్ని పత్రికలలో తాను అప్పటి కలెక్టర్ల‌పై ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయని, ఇవి తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. తన వృత్తి జీవితంలో గానీ, ఐఏఎస్‌లో చేరినప్పటి నుండి ఎప్పుడూ ఏ అధికారికీ తప్పుడు పని చేయమని చెప్పలేదన్నారు. దేవానంద్ చేసినట్లు రాసిన ఆరోపణలు తాను ఖండిస్తున్నానని అన్నారు.

English summary
IAS officer Bhanu condemned Devanand statement on Monday. He said he and late YS Rajasekhar Reddy did not pressure any one for anything.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X