హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎన్ఎ వివాదం: డిఎన్ఎ టెస్టుకు సిసిఎంబికి ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

CCMB
హైదరాబాద్: సిసిఎంబి డిఎన్ఎ పరీక్షలను గోప్యంగా జరిపించి తన భార్యకు పుట్టిన బిడ్డకు తాను తండ్రిని కాదంటూ వాదిస్తున్న రమేష్ అనే వైద్యుడి ఉదంతం మానవ హక్కుల కమిషన్‌కు (హెచార్సికి) చేరింది. రమేష్, ఆయన భార్య యమునకు, వారి బిడ్డకు మళ్లీ డిఎన్ఎ పరీక్ష నిర్వహించాలని హెచార్సీ సిసిఎంబిని ఆదేశించింది. ఈ వివాదంపై యమున హెచార్సీకి ఫిర్యాదు చేసింది. రమేష్ తన రక్తాన్ని పరీక్షకు ఇవ్వలేదనే అనుమానం వ్యక్తం చేసింది. కేసును తిరిగి దర్యాప్తు చేసి ఈ నెల 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని హెచార్సీ సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. కేసును ఎల్బీనగర్ ఎసిపితో కాకుండా వేరే ఎసిపితో దర్యాప్తు చేయించాలని కూడా హెచార్సీ సూచించింది.

డిఎన్ఎ నివేదిక తాము ఇచ్చిందేనని, అయితే అది చెల్లుబాటు కాదని హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులార్ మోలిక్యులార్ బయోలజీ (సిసిఎంబి) స్పష్టం చేయడంతో హైదరాబాదులోని యమున, రమేష్‌ల వివాదం గతంలో తీవ్ర సంచలనానికి కారణమైంది. హైదరాబాదులోని యమున, డాక్టర్ రమేష్ కేసు మరో మలుపు తిరిగింది. దీంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త డాక్టర్ రమేష్‌ను అరెస్టు చేసినట్లు సరూర్‌నగర్ ఎసిపి చెప్పారు.

హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులార్ మోలిక్యులార్ బయోలజీ (సిసిఎంబి) పేర ఉన్న డిఎన్ఎ రిపోర్టును చూపించి బిడ్డకు తాను బయోలాజికల్ ఫాదర్‌ను కాదంటూ భార్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమెను వదిలించుకోవడానికి ఓ హోమియోపతి వైద్యుడు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన హైదరాబాదులోని సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగింది. డిఎన్ఎ పరీక్షల్లో తల్లీబిడ్డల శాంపిల్స్ మాత్రమే మ్యాచ్ అయ్యాయని సిసిఎంబి చెప్పింది. మరో రక్తం నమూనా మ్యాచ్ కాలేదని చెప్పింది. అయితే, రక్తనమూనాలను తాము సేకిరంచలేదని, తాము సేకరించిన రక్తం నమూనాలతో జరిపిన డిఎన్ఎ పరీక్షల నివేదిక మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.

తాము ఎవరి వద్ద కూడా రక్తనమూనాలను సేకరిచంలేదని చెప్పింది.రమేష్‌దని చెబుతున్న రక్తం నమూనా ఆయనదో, కాదో తమకు తెలియదని చెప్పింది. చెల్లని డిఎన్ఎ నివేదికను రమేష్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడని చెప్పింది. భార్యాబిడ్డల రక్తాన్ని ఓ ప్రైవేట్ టెక్నీషియన్ ద్వారా రహస్యంగా తీయించి, సిసిఎంబిలో డిఎన్ఎ పరీక్ష చేయించానంటూ రమేష్ చెప్పాడు. తన భార్య యమునకు పుట్టిన బిడ్డకు తాను తండ్రిని కాదని అంటూ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి.

రమేష్ హోమియోపతి వైద్యుడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన యమునతో అదే జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని రమేష్‌కు 22 ఏళ్ల క్రితం పెళ్లయింది. అయితే, వారికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఇటీవల యుమన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన నాలుగైదు రోజులు రమేష్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత యమునపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమెకు మరో వ్యక్తితో వైవాహికేతర సంబంధం ఉందంటూ ఆరోపించడం ప్రారంభించాడు. తనను రమేష్ మానసికంగా, శారీరకంగా హింసిస్తూ తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని యమున రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడనికి కూడా ప్రయత్నించాడని ఆమె రమేష్‌పై ఫిర్యాదు చేసింది.

English summary
HRC has ordered CCMB to conduct fresh DNA test to Ramesh, his wife yamuna and their child to prove the praternity of Ramesh. It also ordered Cyberabad commissioner to conduct fresh probe on that issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X