వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ గేమ్: టిడిపి నేతలకు కొత్త చిక్కులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు కొత్త తలనొప్పి పట్టుకుందట. తెదెపా పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు వచ్చినప్పుడు ధీటుగా స్పందించే వారిని అధికార కాంగ్రెసు పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు టార్గెట్‌గా చేసుకుంటున్నాయట. కేసులు, బెదిరింపులు, ఆపరేషన్ ఆకర్ష్‌లు తదితరాలను వారిపై ప్రయోగిస్తున్నారని అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో చిక్కుకోవడంతో చంద్రబాబును కూడా అదే తరహా కొట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావించి.. కోర్టులకు వరకు వెళ్లింది. దీనిపై టిడిపి నేతలు ఘాటుగానే స్పందించారు. బాబు పైన వైయస్ రాజశేఖర రెడ్డి కేసులు వేసి వెక్కి తీసుకున్నారని అలాంటి వాటికి భయపడేది లేదని చెప్పారు. బాబు విషయాన్ని పక్కన పెడితే ధీటుగా స్పందించే ఇతర నేతలను కూడా ఆయా పార్టీలు టార్గెట్ చేసుకుంటున్నాయంటున్నారు.

ఇటీవల చంద్రబాబు వస్తున్నా పాదయాత్ర ముగింపు సభ విశాఖపట్నంలో ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ వెంటనే రేవంత్ పైన విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. అంతకుముందు సహకార ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ పైన కేసు నమోదు చేసు జైలుకు పంపించారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఒంటికాలిపై లేచే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌కు అప్పట్లో బెదిరింపులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును నిత్యం టార్గెట్ చేసుకునే మోత్కుపల్లి నర్సింహులుకు కూడా బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదు చేశారు. టిడిపి నేతలను మానసికంగా దెబ్బతీసేందుకు అధికార పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు బెదిరింపులు, కేసులు, ఆపరేషన్ ఆకర్ష్‌ల పేరుతో కొత్త మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు.

బాబుకు నిత్యం అండగా నిలిచే నేతలను మొదట తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారట. అది కుదరకపోతే బెదిరింపులు లేదా కేసుల వంటి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ గుట్టు చప్పుడు కాకుండా మజ్లిస్ పార్టీ నేతల పాత కేసులు తోడినట్టు తోడే అవకాశాలు కూడా లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూడా టిడిపి నేతలు మానసికంగా సిద్ధమవుతున్నారట.

పొలిటికల్ గేమ్: టిడిపి నేతలకు కొత్త చిక్కులు (పిక్చర్స్)

వైయస్ జగన్ ఆస్తుల కేసులో చిక్కుకున్న తర్వాత చంద్రబాబును కూడా అదే తరహాలో దెబ్బ కొట్టాలనుకున్నారు. బాబుకు అండగా నిలిచే నేతలను ఇప్పుడు బెదిరింపు, కేసులు వేయడం లేదా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.

పొలిటికల్ గేమ్: టిడిపి నేతలకు కొత్త చిక్కులు (పిక్చర్స్)

సహకార ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్‌ రావు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

పొలిటికల్ గేమ్: టిడిపి నేతలకు కొత్త చిక్కులు (పిక్చర్స్)

విశాఖలో బాబు పాదయాత్ర ముగింపు సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

పొలిటికల్ గేమ్: టిడిపి నేతలకు కొత్త చిక్కులు (పిక్చర్స్)

కెసిఆర్‌ను నిత్యం టార్గెట్ చేసుకునే మోత్కుపల్లి నర్సింహులుకు పలుమార్లు బెదిరింపు ఫోన్స్ వచ్చాయి.

పొలిటికల్ గేమ్: టిడిపి నేతలకు కొత్త చిక్కులు (పిక్చర్స్)

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించినందుకు రాజేంద్ర ప్రసాద్‌కు బెదిరింపులు వచ్చాయి.

పొలిటికల్ గేమ్: టిడిపి నేతలకు కొత్త చిక్కులు (పిక్చర్స్)

బాబుకు అండగా ఉండే నేతలను తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు కూడా ఆయా పార్టీలు చేస్తున్నారంటున్నారు. బాబుపై అసంతృప్తితో ఉన్న దాడి వీరభద్ర రావును అలా సమయం చూసుకోని లాక్కున్నారని అంటున్నారు.

English summary
It is said that Other parties are targetted Telugudesam Party leaders with cases and Operation Aakarsh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X