వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యం కోరుకుంటున్నా కానీ.., పిసిసి వదిలేస్తా: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
చిత్తూరు/విశాఖ: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. ఆయన ఈ రోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు.

అయితే విభజన విషయంలో తమ పార్టీ అధిష్టానందే తుది నిర్ణయం అన్నారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం ఉంటే బాధాకరమైనా తాను వ్యతిరేకించనని చెప్పారు. తెలంగాణ, సమైక్యాంధ్ర విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ఎప్పుడు పిలిచినా తాను వెళ్లి పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

పదవుల కోసమే తెలంగాణపై నిర్ణయం విషయంలో రాజకీయమంటే తాను పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పదవుల కోసమే తెలంగాణ అన్నా తాను పిసిసి వదులకునేందుకు సిద్ధమన్నారు. తుడా చైర్మన్‌గా మాజీ శాసన సభ్యుడు వెంకటరమణను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారని, తర్వాత ఉత్తర్వులు వెలువడుతాయన్నారు.

12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 12వ తేదిన ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన కారణంగా మంత్రివర్గ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు బదులు ఉదయానికి మారింది.

English summary
PCC cheif Botsa Satyanarayana on Tuesday said that he will obey Congress Party High Command's decision on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X