వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి:అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...నేడు 10 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఈ రోజు ప్రారంభం కానున్న ఎపి అసెంబ్లీ సమావేశాలు

అమ‌రావ‌తి:మంగళవారం నాటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు యాథావిథిగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

అసెంబ్లీ సమావేశాల్లో నేడు పలు కీలక అంశాలపై చర్చతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 10 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. సివిల్‌ కోర్టు సవరణ, ఉర్దూ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, మోటార్‌ వాహనాల బిల్లు, హౌసింగ్‌ బోర్డు సవరణ బిల్లు, వివాహాల నమోదు బిల్లు, రెపియల్‌కు సంబంధించిన-2, దుకాణాల ఏర్పాటుకు బిల్లులను ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుందని సమాచారం.

10 bills will be introduced in Andhra Pradesh assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. కాగా ఈ సమావేశాల ప్రారంభానికి ముందు శాసన సభ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నేడు, రేపు సభలో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహ కమిటీ సభ్యులకు సూచించారు.

ప్రజలిచ్చిన బాధ్యత నిర్వహించడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో పది బిల్లులను ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుండగా...వీటిలో రెపియల్‌కు సంబంధించి 2 బిల్లులతో పాటు దుకాణాల ఏర్పాటు, సివిల్‌ కోర్టు సవరణ, ఉర్దూ విశ్వవిద్యాలయం సవరణ, మోటారు వాహనాల పన్ను, హౌసింగ్‌ బోర్డు సవరణ, వివాహాల నమోదు బిల్లులు కూడా ఉన్నాయి.

ఇక ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత కార్మికులకు సబ్సిడీ మొత్తాల మంజూరీపై అసెంబ్లీ లో చర్చ జరుగింది. అలాగే విశాఖ జిల్లా కంచరపాలెంలో భూముల క్రమబద్ధీకరణ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల మూసివేత, జగ్గయ్యపేట నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్‌, జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ తదిదర అంశాలపై ప్రశ్నోత్తరాల్లో చర్చ అనంతరం సంబంధిత మంత్రులు అసెంబ్లీ వేదికగా వివరణ ఇవ్వనున్నారు.

English summary
Amaravathi: The AP Assembly Session on Tuesday began as usual at 9'o Clock. As soon as the meetings began, Speaker Kodela Shivaprasad took up the Question Hour. Another side the state government is ready to introduce 10 bills in Assembly on today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X