వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీఎస్సీకి 6 లక్షల ధరఖాస్తులు...ఆదివారం సాయంత్రంలోపు తప్పులు సరిచేసుకోవాలి!

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న డిఎస్సీ-2018 ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష కోసం శనివారం నాటికి 6,06,325 మంది ఫీజు చెల్లించినట్లు
పాఠశాల విద్యా శాఖ తెలిపింది.

అయితే ఫీజు చెల్లించినవారిలో 5,65,833 దరఖాస్తులు మాత్రమే ఆన్ లైన్ ద్వారా శనివారం నాటికి అందినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి వెల్లడించారు. అలాగే ఈ దరఖాస్తులు పంపినవారిలో కూడా దాదాపు 16వేల మంది అభ్యర్థులు తమ టెట్‌ హాల్‌టికెట్‌ నంబర్లను తప్పుగా నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. వీరంతా ఆదివారం సాయంత్రంలోగా తమ డీఎస్సీ దరఖాస్తులోని తప్పులు సరిదిద్దుకోవాలని మెసేజ్‌లు పంపామని చెప్పారు.

శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ డిఎస్సీ దరఖాస్తులో అభ్యర్థులు నమోదు చేసిన టెట్‌ హాల్‌టికెట్‌ నంబరు కరెక్ట్ కాకున్నా, ఇతర వివరాలతో సరిపోకపోతే డీఎస్సీ హాల్‌ టికెట్లు జనరేట్ కావని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరోవైపు డిఎస్సీ దరఖాస్తు సందర్భంగా పదవ తరగతి పరీక్ష హాల్ టికెట్ నంబర్ అడగడాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు.

 6 lakhs applications for DSC-2018

ఈ ఏడాది బీఈడీ చేసినవారే సుమారు ఏడేళ్లు క్రితం టెన్త్‌ పూర్తిచేసి ఉంటారని...పైగా మార్కుల లిస్ట్ లో హాల్ టికెట్ నంబర్ ఉండదని...అలాంటప్పుడు అప్పటి హాల్‌ టిక్కెట్‌ నెంబర్‌ ఇవ్వడం ఎలా సాధ్యమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇక డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచడంతో ఈ అభ్యర్థులు దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి టెన్త్‌ హాల్‌ టికెట్ నంబర్ నమోదు చేయాడం ఎలా సాధ్యమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే దరఖాస్తులో స్థానికత గురించి వివరాలు పూర్తి చేసే విషయమై అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. జీవో నంబర్‌ 133 మేరకు స్థానికత క్లెయిమ్‌ చేసుకుంటారా అని దరఖాస్తులో పేర్కొనడంతో అందుకు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక పలువురు అభ్యర్థులు అవునని, కొందరు కాదని అవగాహన లేకుండా తమ ఆలోచన మేరకు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వం తప్పుల సవరణకు ఆదివారం సాయంత్రం వరకు గడువు ఇచ్చినా చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు కారణం...ఉద్యోగానికి ఎంపికయ్యాక కదా ఏమైనా సమస్యలు ఎదురయ్యేది...అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాములే అనే ధోరణిలో ఎక్కువమంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ డిఎస్సీకి దరఖాస్తులు భారీగా రావడంతో నియామక ప్రక్రియ ఆద్యంతాలపై ఆసక్తి నెలకొంది.

English summary
As many as 6,06,325 candidates were paid fees till Saturday for AP DSC -2018 examination, said School Education Department. However 5,65,833 applications we received till Saturday added school Education commissioner sandhyarani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X