అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు..! తీవ్ర ఉద్రిక్తత..!
ఏపీలో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ రిపోర్ట్ నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య మొదలైన మాటల యుద్దం కాస్తా ఇవాళ దాడుల వరకూ వచ్చేసింది. సిట్ రిపోర్ట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎక్కడా లేదని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టింది. దీనికి కౌంటర్ గా టీడీపీ జగన్, భూమన, సుబ్బారెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీ వార్ ప్రారంభించింది. దీన్ని కౌంటర్ చేసేందుకు రంగంలోకి దిగిన వైసీపీ నేత అంబటి రాంబాబు( ambati rambabu ) రంగంలోకి దిగడంతో వార్ ముదిరింది.
ఇవాళ గుంటూరులో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన మహాపాపం ఫ్లెక్సీని తొలగించేందుకు బయలుదేరిన అంబటి రాంబాబును ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. కర్రలతో ఆయన కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అంబటి టీడీపీ నేతలతో పాటు చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వారు మరింత రెచ్చిపోయారు. కానీ పోలీసులు దగ్గరుండీ అంబటిని అక్కడి నుంచి పంపేశారు. అనంతరం అంబటి ఇంటికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు.

అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు ఆయన కారుతో పాటు ఇంట్లోని వస్తువులపై కూడా దాడి చేశారు. చంద్రబాబుపై వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నా వారిని అడ్డుకోలేకపోయారు. దీంతో గంట పాటు ఈ విధ్వంసం కొనసాగింది. అనంతరం పోలీసులు వారిని అక్కడి నుంచి పంపేశారు. అలాగే అంబటి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ ఉద్రిక్త వాతావరణం మధ్య వారు కూడా వెనుదిరిగారు. అనంతరం అంబటిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!












Click it and Unblock the Notifications