ఎపి అసెంబ్లీ నిరవధికంగా వాయిదా....
అమరావతి: ఎపి అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ప్రకటించారు. ఈ విడత అసెంబ్లీ సమావేశాలు 12 రోజుల్లో 51 గంటల పాటు జరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈదఫా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.
అయితే ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. కాపులకు 5శాతం రిజర్వేషన్ వర్తించేలా తీసుకున్న నిర్ణయం ఈ సమావేశాల్లోనే తీసుకోవడం, బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించడం జరిగింది.

మరోవైపు బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ శనివారం ఆమోదించింది. బోయలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.












Click it and Unblock the Notifications