సచివాలయ ఉద్యోగులకు మరో షాక్..! తాజా ఆదేశాలు..!
ఏపీలో వైసీపీ హయాంలో అమల్లోకి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధలో కూటమి సర్కార్ తాజాగా భారీ మార్పులు చేస్తోంది. ప్రజలకు పథకాలతో పాటు అన్ని సేవల్ని అందించేందుకు వీలుగా వీటిలో ప్రక్షాళన చేస్తోంది. ఉద్యోగుల బదిలీలు, సచివాలయ వర్గీకరణతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత చేసిన తర్వాత కూడా సచివాలయాలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది తెలుసుకోవాలని భావిస్తోంది.
ఇందుకోసం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాలు, ధృవపత్రాలు, ఇతర దరఖాస్తుల స్వీకరణ, సిబ్బంది అందుబాటు వంటి పలు అంశాలపై ఈ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చే ప్రజాభిప్రాయం ఆధారంగా సచివాలయాల్లో మార్పులు చేర్పులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల్ని అందుబాటులో ఉంచాలని డీడీవోలు, ఎంపీడీవోలు, ఎంసీలు, ఎంజీవోలు, యూజీవోలకు ఆదేశాలు వెళ్తున్నాయి. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందుబాటులో ఉంటున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటోందని ఆయా ఆధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు పంపుతున్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకుంటున్నందున సిబ్బందిని పూర్తి స్దాయిలో సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని, మూమెంట్ రిజిస్టర్ నిర్వహించాలని, ప్రజలతో మర్యాదగా, సున్నితంగా మాట్లాడాలని జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు.

అయితే ప్రభుత్వ ఆదేశాలపై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో పలు మార్పులు చేస్తూ.. హాజరుపై నిఘా పెట్టడం, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తమపై సర్వేలు చేయించడంపై వారు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఏ శాఖ ఉద్యోగులపైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని వారు చెప్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, అదే సమయంలో తమను ఒత్తిడిలోకి నెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
-
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications