గోదావరి పుష్కరాల తేదీలపై తాజా నిర్ణయం - ఘాట్లు, ఏర్పాట్లు..ఈ సారి కొత్తగా..!!
గోదావరి పుష్కరాల ముహూర్తం అధికారికంగా ప్రకటించారు. అనేక చర్చల తరువాత పండితుల సూచనల మేరకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. ఈ సారి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే ఛాన్స్ ఉందని అంచాన వేస్తున్నారు. అందులో భాగంగా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అటు, కేంద్రం నిధులను మంజూరు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పనుల నిర్వహణ కోసం కమిటీ ప్రకటించింది. ఈ సారి గోదావరి పుష్కరాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుష్కరాల తేదీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2027 సంవత్సరానికి వచ్చే గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగేలా నిర్ణయించింది. మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తాన సిధ్ధాంతి శ్రీ థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన అభిప్రాయం మేరకు పుష్కరాల తేదీలను ఖరారు చేసారు. పుష్కరాల ప్రవేశ-ప్రస్థాన ఘడియలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఆయన చేసిన జ్యోతిష్య విశ్లేషణను దేవదాయ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించి న ప్రభుత్వం, పుష్కరాలు జూన్ 26 ఉదయం ప్రారంభమై జూలై 7 వరకు కొనసాగుతాయని అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

దాదాపు 8 కోట్ల మంది భక్తుల వస్తారన్న అంచనాతోపాటు, ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75,000 మంది వరకూ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే హాజరయ్యే భక్తుల అంచనాతోపాటు వివిధ సౌకర్యాల గురించి చర్చలు జరిపారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తునందున ఈ ప్రాంతాలలో పుష్కర పనులు వేగవంతమయ్యేలా చూస్తుంది. తాజాగా దీనికి సంబంధించి పలు శాఖలు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్య ఇస్తూ.. రద్దీ నియంత్రణ పైన ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఘాట్‌లో 50 మీటర్లకు ఒక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందులోనే 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చే గదులు, 6 వాటర్ ఏటీఎంలు, అందుబాటులోకి తీసుకొస్తారు.
ప్రతి భక్తుడు ఘాట్‌లోకి వెళ్లి పుణ్యస్నానం చేసి 15 నిమిషాల్లో బయటకొస్తారని అంచనా వేశారు. ప్రతి కంపార్ట్మెంట్ నుంచి ఒక రోజు (18 గంటలు)లో 44,928 మంది పుణ్యస్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. గోదావరికి ఇరు వైపులా 7.06 కిలోమీటర్ల మేర 97 ఘాట్లు అందుబాటు లో ఉంచాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తూర్పువైపు 4.93 కిలోమీటర్ల పరిధిలో 45 ఘాట్లను అధికారులు సిద్ధం చేస్తారు. అటు కేంద్రం.. రైల్వే శాఖ సైతం పుష్కరాల ఏర్పాట్లలో ముందుకు వచ్చాయి. ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల కోసం టెంట్ సిటీలు, ఘాట్ల నిర్వహణ.. భక్తులకు వసతి కల్పించేలా ప్రభుత్వం కసత్తు చేస్తోంది. ఇప్పటికే నియమించిన మంత్రివర్గ ఉప సంఘం కుంభమేళాలో అనుసరించిన విధానాల పై కసరత్తు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..!












Click it and Unblock the Notifications