వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్దానం కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ .. వారికోసం ఉచితంగా

|
Google Oneindia TeluguNews

ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు సంబంధించిన బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితులుగా ఉన్నవారు డయాలసిస్ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడు కాకుండా, వారికి కావలసిన ప్రయాణ సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు కాస్త ఉపశమనం పొందుతున్నారు.

Recommended Video

ఉద్దానం సమస్యకు పరిష్కారం దిశగా జగన్ అడుగులు || AP Govt Issued Orders For 600cr To Uddanam Area

90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్ .. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు : సీఎం జగన్ ఆదే90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్ .. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు : సీఎం జగన్ ఆదే

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయం

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయం

ఇక శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాల పరిధిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మొత్తం 2856 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి అవకాశం కల్పిస్తూ, నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డయాలసిస్ చేయించుకున్న రోగులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ను అందిస్తోంది. అంతేకాకుండా అటు సీరం క్రియాటినైన్ 5 కు మించి ఉన్న రోగులకు కూడా నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది.

డయాలసిస్ కు దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఉపశమనం

డయాలసిస్ కు దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఉపశమనం

ఇక వీరంతా మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన పరిస్థితుల్లో వారి ఖర్చు తడిసి మోపెడు అవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఊరటనిస్తుంది. ఇక ఇప్పటికే చాలామంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత అంబులెన్స్ సేవలు కూడా అందిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని తీసుకున్న నిర్ణయంతో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్ నిర్ణయం పట్ల హర్షం

సీఎం జగన్ నిర్ణయం పట్ల హర్షం


ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, సీఎం జగన్ మోహన్ రెడ్డి చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ విషయంలో సీఎం జగన్ చూపిస్తున్న శ్రద్ధపై ఉద్దానం కిడ్నీ బాధితులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో పడుతున్న కష్టాలను తొలగించేలా కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఊరట నిచ్చేవిధంగా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఉచితంగా పాస్‌లు అందించే నిర్ణయం సంతోషం కలిగిస్తోందని వారు పేర్కొన్నారు .

English summary
The government of andhrapradesh has provided good news to the victims of Kidney Disease. The decision was made to allow free travel on state road transport buses for kidney patients. The decision taken by the state government is already a relief for the affected families as the travel costs are becoming burden. As many as 2856 Kidney patients will be provided with free travel in RTC buses under 38 zones of the Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X