ఐఏఎస్ లు దరిద్రం మనకు.. రూ.1000 కోట్లు ఇస్తామన్నారు
ఏపీలో అధికార కూటమికి ఆ నేత తలనొప్పిలా మారారా? ఇటీవల జాతీయ మీడియాలో టీడీపీని హైప్ చేయబోయి బొక్క బొర్లా పడినా ఆయనలో మార్పు రాలేదా?. అదే పనిగా ప్రభుత్వానికి డ్యామెజ్ చేసే పనిలో పడ్డారా?. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఐఏఎస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు జగన్ ఓడిపోవడానికి కూడా ఈ ఐఏఎస్‌లే కారణం అని మండిపడ్డారు. 14 నెలలుగా తనకు జీతం లేదని ఆవేదనను బయటపెట్టేశారు. ఈ క్రమంలోనే నాకు జీతం ఇవ్వడానికి ఏం రోగం మీకు? అంటూ పరుష పదజాలాలు వాడేశారు. ఇంతకీ ఈ నేతకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే...
మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్‌రెడ్డి వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవల ఇండిగో విమానాల వివాదం నడుస్తున్న సమయంలో నేషనల్ మీడియాలో నారా లోకేష్ గురించి చేసిన కామెంట్స్ పార్టీకి, ప్రభుత్వానికి నెగిటివ్ టాక్ తెచ్చిపెట్టగా.. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో మారు ప్రభుత్వంలో ఉన్న అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకనొక దశలో పలువురు ఐఏఎస్ ల జాతకాలు బయటపెడతా అని.. వాళ్లు వేల కోట్లు రూపాయలు ఎక్కడ నుంచి సంపాదించారని ప్రశ్నిస్తూనే వార్నింగ్ ఇచ్చేశారు. దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, అధికార వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
14 నెలలైనా ఒక చిన్న ఫైల్ క్లియర్ చేయలేదు..
సీడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న తనకు గత 14 నెలలుగా జీతం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదో చిన్న పేరు తప్పిదం వలన జీతం పడటం లేదని కూడా తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. తాను జీతం తీసుకునే స్థితిలో లేనని.. కానీ ఒక కార్పొరేషన ఛైర్మన్, పార్టీలో కీలక నేతకు సంబంధించిన ఫైల్ క్లియర్ చేయడానికి అధికారులకు ఎంత సమయం పడుతుందని మండిపడ్డారు. ఫైనాన్స్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా ఫైల్ క్లియర్ చేయడం లేదని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. "14 నెలలైనా ఒక చిన్న ఫైల్ క్లియర్ చేయలేని వారికి అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా? నాకు జీతం ఇవ్వడానికి ఏం రోగం మీకు? అని పరుష పదజాలాలు ఉపయోగించారు.

వీళ్ల వల్లనే జగన్ ఓడిపోయాడు..
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు వ్యవస్థకు పట్టిన గ్రహణంలా, దరిద్రంలా తయారయ్యారని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన కూతురి పెళ్లికి రూ.1000 కోట్ల కట్నం ఇస్తానని స్వయంగా నాతోనే చెప్పారని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అన్ని వేల కోట్లు వీళ్ల ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఒక్కొక్కరి విల్లాలు చూస్తే మతిపోతుందన్నారు. ఇలాంటి దొంగలు వ్యవస్థలో చాలా మంది ఉన్నారని.. 2019లో చంద్రబాబు, 2024లో జగన్ ఈ ఐఏఎస్ ల వలనే ఓడిపోయారని తేల్చిచెప్పారు. అంతా బ్రహ్మాండంగా ఉందని షో చేస్తారని తాను స్వయంగా చూసిన ఓ విషయాన్ని వివరించారు. ప్రజల కోసం పనిచేయాల్సిన కలెక్టర్లు, ఐఏఎస్‌లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు.
తీవ్ర చర్చనీయాంశంగా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారుల తీరు మారలేదని ఎమ్మెల్యేలు, మంత్రులు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారు ఇంకా వైసీపీ నేతలకే పని చేస్తున్నారని చాలా మంది నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే అధికారులు పద్ధతి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు కూడా పలుమార్లు సూచించారు. ప్రభుత్వంలో ఉన్న ఒక కార్పొరేషన్ ఛైర్మన్ ఫైల్ ను క్లియర్ చేయని అధికారులు, సామాన్యుల గురించి ఏం పట్టించుకుంటారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications