చంద్రబాబుపై లండన్ లో నిఘా ? షాకింగ్ రీజన్ ..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఓ బాంబు పేల్చారు. గతంలో తాను లండన్ వెళ్లినప్పుడు జరిగిన ఓ పరిణామాన్ని ఆయన బయటపెట్టారు. లండన్ మ్యూజియాన్ని తాను సందర్శించినప్పుడు ఆయనపై ఎలా నిఘాపెట్టారో చంద్రబాబు తాజాగా వివరించారు. విజయవాడలో నిర్వహించిన ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ లో పాల్గొన్న చంద్రబాబు చెప్పిన ఈ విషయం చర్చనీయాంశంగా మారుతోంది.
సీఎం చంద్రబాబు గతేడాది లండన్ పర్యటనకు వెళ్లారు. ఏపీకి పెట్టుబడులు సాధించేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీలు అయ్యారు. మధ్యలో లండన్ మ్యూజియానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే కోహినూర్ వజ్రం కూడా ఉంది. దీంతో అక్కడికి వచ్చే వారిపై ఎలాగో నిఘా ఉంటుంది. ఇదే క్రమంలో చంద్రబాబుపైనా నిఘా పెట్టారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ కోహినూర్ వజ్రాన్ని తాను ఎక్కడ అడిగి తీసుకెళ్లిపోతాననే తనపై నిఘా పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు.

దీంతో లండన్ పర్యటనలో కోహినూర్ వజ్రం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన, లండన్ మ్యూజియం సందర్శనకు వెళ్దామనుకుంటే తనను అనుమతించలేదని, తాను వెళ్తే కోహినూర్ వజ్రం అడుగుతానని వారికి భయం అని సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా "తానే క్లీన్ కోహినూర్ డైమండ్" అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతకీ ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే.. మన ఘనమైన వారసత్వ సంపదకు కోహినూర్ డైమండ్ ఓ చిహ్నమని చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఆవకాయ్ అమరావతి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా వీటి ప్రత్యేకతను వివరిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
Heatwave: ఏపీలో 48 గంటల్లో తీవ్ర వడగాల్పులు..! ఎస్డీఎంఏ తాజా హెచ్చరికలు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications