నేడే రాష్ట్రానికి చంద్రబాబు రాక...
అమరావతి: కుటుంబంతో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ర్టానికి తిరిగి వస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ఆయన కుటుంబంతో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
నాలుగు రోజులపాటు మాల్దీవుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో ఖుషీగా గడిపారు. చంద్రబాబు కుటుంబం మాల్దీవులకు బయలుదేరే సమయానికి మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన అమెరికా పర్యటన నుంచి నేరుగా మాల్దీవులు చేరుకొని అక్కడ ఫ్యామిలీతో జత కలిసారు. ఆ తరువాత అక్కడ కుటుంబం అంతా కలసి సరదాగా సమయం గడుపుతున్నారు. ఇలా సాగుతున్న ఈ విదేశీ పర్యటన శుక్రవారంతో ముగియనుంది. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో సహా ముందు హైదరాబాద్‌కు వచ్చి, సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.













Click it and Unblock the Notifications