Chandrababu: రేపు విజయనగరానికి చంద్రబాబు-ఫుల్ షెడ్యూల్ ఇదే...!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (chandrababu) రేపు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు.
జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే HPV వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే ప్రజా వేదికలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
రేపు ఉదయం 09.30 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి 11.10 గంటలకు చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్తారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చిన బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.

ఆ తర్వాత 12 గంటలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రారంభిస్తారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీఎం రావివలసలో పాల్గొంటారు. తర్వాత ఏపీలో చేపట్టనున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు రావివలసలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పేదలకు పింఛన్ల పంపిణీ చేస్తారు. చివరిగా 3.15 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో బాబు సమావేశమవుతారు. అలా టూర్ పూర్తి చేసుకుని రాత్రి 7 గంటలకు చంద్రబాబు అమరావతి చేరుకుంటారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications