3 రోజుల పాటు కోడి పందేలు: ఊరటనిచ్చిన చినరాజప్ప

Posted By:
Subscribe to Oneindia Telugu

కాకినాడ: సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు కోడి పందేలు అనుమతి ఉంటుందని ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సిఎం ఎన్. చినరాజప్ప చెప్పారు. ప్రభుత్వం చట్టాలను గౌరవించాల్సి ఉంటుందని, అదే సమయంలో సంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుందని అన్నారు.

బెట్టింగులు లేకుండా కోడి పందేలను నిర్వహిస్తే అది చట్ట విరుద్ధం కాదని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. కోడిపుంజులకు కత్తులు కట్టకుండా, ఇతర క్రూరమైన పద్ధతులను పాటించకుండా నిర్వహిస్తే కూడా చట్ట విరుద్ధం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Cockfights will be allowed for 3 days in AP

సం్రంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రలో పెద్ద యెత్తున కోళ్ల పందేలను నిర్వహిస్తారు. వాటిని కోర్టు నిషేధించింది. అయినప్పటికీ ఆవి జరుగుతూనే ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Deputy Chief Minister N. Chinarajappa said on Friday that cockfights would be allowed for three days during Sankranti.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి