ఆ మూడు స్కిల్స్ వల్లే రూ.2 కోట్ల వేతనం పొందే ఉద్యోగం వచ్చింది:దిలీప్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దిలీప్ (ఇంటిదుర్గా లక్ష్మీనారాయణస్వామి) ఆపిల్ లో ఏడాదికి రెండుకోట్ల వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.అయితే ఈ నెల 22న, ఆయన ఉద్యోగంలో చేరారు. అయితే మూడు రకాల స్కిల్స్ ఉంటే ఎక్కడైనా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుందని దిలీప్ చెబుతున్నారు. చిన్నతనం నుండి కష్టపడి చదివిన దిలీప్ ఆపిల్ కంపెనీలో ఏడాదికి రెండు కోట్ల రూపాయాల వేతనం పొందే ఉద్యోగానికి ఎంపికయ్యారు.

సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన దిలీప్ ఆపిల్ లో ఉద్యోగం సాధించి కష్టపడితే ఏదైనా సాధ్యమని నిరూపించాడు. అతని సోదరుడు కూడ చెన్నైలో ఇన్పోసిస్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆపిల్ కంపెనీ నిర్వహించిన మూడు ఇంటర్వ్యూల్లో దిలీప్ విజయం సాధించాడు. అయితే తమకున్న నాలెడ్జ్ ను సమర్థవంతంగా ఇంటర్వ్యూలో ప్రదర్శించగలిగితే ఇంటర్వ్యూల్లో సక్సెస్ సాధ్యమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

సాఫ్ట్ వేర్ కంపెనీల్లో మాంధ్యం కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న సందర్భంలో ఆపిల్ కంపెనీలో తెలుగు తేజం ఏడాదికి రూ.2 కోట్ల వేతనంతో కూడిన ఉద్యోగం సాధించడం అద్భుతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆ మూడు స్కిల్స్ తోనే ఉద్యోగం

ఆ మూడు స్కిల్స్ తోనే ఉద్యోగం

ఎక్కడైనా ఉద్యోగం సాధించాలంటే ఇంటర్వ్యూకు హాజరైన వారు మూడు రకాల స్కిల్స్ ను ప్రదర్శించాలని దిలీప్ చెప్పారు. కోర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ స్కిల్స్ , కోర్ నాలెడ్జ్ విషయంలో ఫండమెంటల్స్ లో ఏ స్థాయిలో పట్టుందో పరిశీలిస్తారు. అంతేకాకుండా వాటిని అన్వయించే విషయంలో కూడ ఆలోచన సామర్థ్యాన్ని కూడ పరిశీలిస్తారు. అన్నీ బాగున్నాయకుంటేనే ఉద్యోగం ఇస్తారని దిలీప్ చెప్పారు. అయితే అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో తమకున్న నైపుణ్యాలను పూర్తిస్థాయిలో ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు.

45 నిమిషాల్లో ఇంటర్వ్యూను పూర్తి చేశాను

45 నిమిషాల్లో ఇంటర్వ్యూను పూర్తి చేశాను

వర్క్ ఎక్స్ పీరయిన్స్ , వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా ఇంటర్వ్యూకు సిద్దమైనట్టు దిలీప్ అభిప్రాయపడ్డారు. ఫండమెంటల్స్ పై పట్టుబడడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హజరయ్యాను. రెండు రౌండల్లో ఇంటర్వ్యూ జరిగింది. తొలి రౌండ్ లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో సంతృప్తికరంగా సమాధానాలు చెప్పడంతో ఆపిల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఇన్విటేషన్ పంపారు.రెండు ఇంటర్వ్యూలను 30 నుండి 45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశానని చెప్పారు. ఫ్రోఫైల్ ఆధారిత ప్రశ్నలతో పాటు, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ పై పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూలో వచ్చే ప్రశ్నలపై ముందుగానే కసరత్తు చేయడంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు దిలీప్ చెప్పారు.

రూ.2 కోట్ల జీతం కైవసం చేసుకొన్నారు

రూ.2 కోట్ల జీతం కైవసం చేసుకొన్నారు

2015 లో వర్జీనియా టెక్ యూనివర్శిటీలో రెండేళ్ళ ఎంఎస్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు దిలీప్. ఏటా ఇనిస్టిట్యూట్ లో ఆపిల్, గూగుల్ వంటి సంస్థలు క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తాయి. అయితే క్యాంపస్ ఇంటర్వ్యూ డ్రైవ్ కు పిలవడానికి తన లింక్డ్ ఇన్ ఫ్రోఫైల్ అని దిలీప్ చెప్పారు. అప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులు, పని అనుభవం, అకడమిక్ రికార్డ్ లను లింక్డ్ ఇన్ లలో చూసిన ఆపిల్ సంస్ఝ ప్రతినిధులు క్యాంపస్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని మెయిల్ పంపారని చెప్పారు.

ఎంఎస్ లో ప్రవేశం అనుహ్యాంగా సాగింది

ఎంఎస్ లో ప్రవేశం అనుహ్యాంగా సాగింది

దిలీప్ ఎంఎస్ లో చేరడం అనుహ్యాంగా జరిగింది. వాస్తవానికి బిట్స్ పిలానిలో బీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ) పూర్తయ్యాక హైద్రాబాద్ లోనే ఇమాజినేషన్ టెక్నాలజీస్ సంస్థలో వైర్ లెస్ పీహెచ్ వై ఫిల్మ్ ఫేర్ ఇంజనీర్ గా రెండేళ్ళపాటు పనిచేశాడు. ఆ సమయంలోనే ఎంబీఏ చదవాలనే ఆసక్తితో క్యాట్ కు హాజరై 99.3 శాతం మార్కులను సాధించాడు. వాస్తవానికి ఈ పర్సంటేజీతో ఏదో ఒక ఐఐఎంలో సీటు వచ్చేది. అయితే వైర్ లెస్ కమ్యూనికేషన్స్ పై ఆసక్తి పెరగడం అందులో నైపుణ్యాలు సైతం లభించడంతో ఎలక్ట్రానిక్స్ లోనే ఉన్నత విధ్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఎంఎస్ పై దిలీప్ దృష్టి కేంద్రీకరించాడు. 2018 లో ఎంఎస్ వర్జీనియా టెక్ యూనివర్శిటీకి ధరఖాస్తు చేయడంతో ప్రవేశం లభించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dilip got job for 2 crore rupees in Apple company.core knowledge , communication skills important for candidates said Dileep.Apple company interviewed him thrice.
Please Wait while comments are loading...