వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవేందర్ గౌడ్ కొడుకు వార్షిక ఆదాయం రూ. 720!

|
Google Oneindia TeluguNews

 Devender Goud’s crorepati son earns only Rs 720
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టి దేవేందర్ గౌడ్ కుమారుడు టి వీరేందర్ గౌడ్ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం మొత్తం చూస్తే అందరికీ ఆశ్చర్యం వేయాల్సిందే. రూ. 58 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వీరేందర్ గౌడ్, ఏడాదికి కేవలం రూ. 720ల పన్ను చెల్లించే ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారట. ఈ విషయాన్ని చేవెళ్ల లోకసభ స్థానం నుంచి టిడిపి తరపున పోటీ చేస్తున్న సందర్భంగా వీరేందర్ గౌడ్ తను దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇంకా తన భార్య టి దివ్యశ్రీ ఆదాయం రూ. 610గా తెలిపారు. కాగా, వీరేందర్ గౌడ్ అమెరికాలోని బోస్టన్‌లోని బేబ్సన్ కాలేజి, మసచూసెట్స్‌లో తన ఎంబిఏను పూర్తి చేయడం గమనార్హం. వీరేందర్ గౌడ్ తనకు గల రూ. 58.27 కోట్లలో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు విలువ రూ. 27.49 కోట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ. 29.60 కోట్లుగా ఉందని తెలిపారు. ఇవి కాకుండా శంషాబాద్, మహేశ్వరంలలో రూ. 1.9 కోట్లు, రూ. 1.59 కోట్ల విలువైన భూమి ఉన్నట్లు, తనకు రూ. 13.25 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు.

తన ఆదాయంపై తన మేనేజర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని వీరేందర్ గౌడ్ తెలిపారు. అయితే తన ఆదాయ వివరాలు నిజాయితీగా తెలిపానని చెప్పారు. తమది ఉమ్మడి కుటుంబమని, తనకు ఆదాయం లభించే వనరులు లేవని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో కొనసాగుతున్నాని తెలిపారు. తన పేరుతో ఒక కారు కూడా లేదని వీరేందర్ గౌడ్ చెప్పారు.

కాగా, చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కార్తీక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తన అఫిడవిట్‌లో పన్ను చెల్లించే అదాయాన్ని రూ. 3.24 లక్షలుగా పేర్కొన్నారు. తన వృత్తి రాజకీయాలని అఫిడవిట్‌లో ఆయన తెలియజేశారు. చరాస్తులు రూ. 76.13 లక్షలు, స్థిరాస్తులు రూ. 2.55 కోట్లుగా ఉన్నట్లు కార్తీక్ రెడ్డి తెలిపారు.

English summary
He could possibly be the crorepati with the lowest taxable income. T. Veerender, the son of former minister T. Devender Goud, has declared assets of more than Rs 58 crore and taxable income of Rs 720.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X