వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు సినీ ప్రముఖుల మద్దతు, రాఘవేంద్ర రావు భేటీ: లోకేష్ 'బ్లాక్ బ్యాడ్జ్'

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. శుక్రవారం టాలీవుడ్ ప్రముఖులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.

అఖిలపక్షం పిలుపు మేరకు తాము కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని చెప్పారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు తమ నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో కే రాఘవేంద్ర రావు, కేఎల్ నారాయణ, జీకే, సీ అశ్వనీదత్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ తదితరులు ఉన్నారు.

చంద్రబాబుకు బాసటగా ఉంటాం

చంద్రబాబుకు బాసటగా ఉంటాం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడం చేస్తున్న చంద్రబాబుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రికి బాసటగా ఉంటామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.

మా మద్దతు

మా మద్దతు

ఇటీవల ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు తెలపలేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోసాని మురళీకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, మంచు లక్ష్మి తదితరులు స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది.

నారా లోకేష్ పోస్ట్

కేంద్రం తీరుకు నిరసనగా అందరూ గంటపాటు ఎక్కువ పని చేయాలని, అలాగే నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలుపుదామంటూ మంత్రి నారా లోకేష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. '5 కోట్ల ప్రజల నిరసన సెగ కేంద్రానికి తగిలేలా...

నల్ల బ్యాడ్జి ధరిద్దాం
రోజుకో గంట ఎక్కువ పనిచేద్దాం
కేంద్రం మనకు చేస్తున్న అన్యాయం పై గళం విప్పుదాం' అని పేర్కొన్నారు.

చంద్రబాబు పోస్ట్

అంతకుముందు, చంద్రబాబు కూడా ఓ పోస్ట్ పెట్టారు. 'రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని నిర్ణయించాం. తమ వంతుగా మరో గంట అదనంగా పనిచేస్తూ నిరసన తెలియజేస్తామని ఉద్యోగ సంఘాలు స్వచ్చంధంగా మద్ధతిచ్చాయి.' అని పేర్కొన్నారు.

English summary
Film industry support Chandrababu Naidu over Special Status issue. On Friday K Raghavendra Rao met CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X